Home > Crime > మూడుముళ్లు వేయగానే భార్య గర్భవతని తెలిస్తే..

మూడుముళ్లు వేయగానే భార్య గర్భవతని తెలిస్తే..

సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. టీవీ నటి, మేకప్ మేన్ అరెస్ట్
కారులొ మహిళను నిర్బంధించి నగలు,రూ 60 నగదు చోరి

pregnant_apduniaకోటి ఆశలతో పెళ్లి చేసుకున్నాడు. కలల ప్రపంచంలో విహరించాడు. ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. తను మూడు ముళ్ళు వేసిన అమ్మాయి అప్పటికే గర్భవతి అని తెలిసి షాక్ అయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కర్ణాటకలోని బిండేనహళ్లికి చెందిన యువతికి దొడ్డగరుడనహళ్లికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడితో పరిచయమైంది. అతడు ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరై గర్భం దాల్చడానికి కారణమయ్యాడు. ఆమె ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల వద్ద దాచింది. గర్భవతిని అని తెలియగానే అతడిని పెళ్లాడాలని ఒత్తిడి చేసింది. కానీ అతడు కాస్తా ఎస్కేప్ అయ్యాడు. ఈలోపు పెద్దలు ఆమెకు వేరే సంబంధం చూశారు. ఈ నెల 8న పెళ్లి కూడా చేశారు. ఐతే మూడుముళ్లు వేసి ఇంటికి తీసుకెళ్లిన భార్యలో కనిపించిన శారీరక మార్పులు చూసి అతడు షాక్ తిన్నాడు. వైద్యుని వద్ద పరీక్ష చేయించగా ఆమె 8 నెలల గర్భవతి అని తేలింది. దీనితో అతడు యువతి తల్లిదండ్రులకు చెప్పాడు. వారు తమ కుమార్తెను మోసం చేసిన యువకుడిపై కేసు పెట్టారు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *