Home > Politics > మోడీపై డిగ్గీరాజా ట్వీట్స్

మోడీపై డిగ్గీరాజా ట్వీట్స్

మళ్లీ విమోచన యాత్ర తో కమలం హడావిడి
నదుల అనుసంధానంతో కరువు దూరం : మంత్రి లోకేశ్

diggiraja-modi-apduniaప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీపై వివాదాస్ప‌ద ట్వీట్ చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్. ఆయన చేసిన ఈ అస‌భ్య‌క‌ర‌ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దిగ్విజ‌య్ తీరుపై బీజేపీ తీవ్రంగా మండిప‌డుతున్న‌ది. ఇందులో ప్ర‌ధాని మోదీ తాను రెండు ఘ‌న‌త‌లు సాధించాన‌ని చెప్పుకున్న‌ట్లుగా ఉండే ఫొటో ఉంటుంది. అందులో ఒక‌టి భ‌క్తుల‌ను పిచ్చోళ్ల‌ను చేశాను.. రెండోది పిచ్చోళ్ల‌ను భక్తుల‌ను చేశాను అన్న వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఇది త‌న‌ది కాక‌పోయినా.. పోస్ట్ చేయ‌కుండా మాత్రం ఉండ‌లేక‌పోతున్నాన‌ని ఆయ‌న అన్నారు. ఇందులోని వ్య‌క్తికి క్ష‌మాప‌ణ‌లు. ప్ర‌జ‌ల‌ను పిచ్చోళ్ల‌ను చేయ‌డంలో ఈయ‌న దిట్ట అని కూడా దిగ్విజ‌య్ మ‌రో కామెంట్ చేశారు. ఈ ట్వీట్ వివాదం కావ‌డంతో దీనిపై ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ వ్యాఖ్య‌లు త‌న‌వి కావ‌ని స్ప‌ష్టంగా చెప్పాన‌ని, ప్ర‌జ‌ల‌ను పిచ్చోళ్ల‌ను చేయ‌డంలో దిట్ట అన్న‌వి మాత్ర‌మే త‌న కామెంట్స్ అని దిగ్విజ‌య్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *