Home > Movies > రేప్ కేసులో బాలీవుడ్ నిర్మాత లొంగుబాటు

రేప్ కేసులో బాలీవుడ్ నిర్మాత లొంగుబాటు

18 కోట్ల బిజినెస్ చేసిన రాజా ది గ్రేట్
వంద కోట్ల క్లబ్ కి చేరువలో జై లవకుశ

1బాలీవుడ్ లో ఛాన్సంటూ యువతిపై వరుస అత్మాచారాలకు ఒడిగట్టిన నిర్మాత కరీం మొరానీ రాచకొండ కమిసనరేటు పరిధిలోని హయత్ నగర్ పోలీససుల ముందు లొంగిపోయాడు. జూలై 2015న షారుక్ ఖాన్, కాజోల్ నటించిన దిల్వాలే సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరిగింది. ఆ సినిమాకు కరీం మొరానీ సహ నిర్మాత. అంతకుముందు షారుక్ ఖాన్తో చెన్నై ఎక్స్ప్రెస్, దిల్వాలే వంటి చిత్రాలు తీసిన నిర్మాత.
రామోజీ సిటీలో షూటింగ్ సమయంలో ముంబైకి చెందిన ఓ యువతి సినిమాలో అవకాశం కల్పించాలని కరీం మొరానీని కలిసింది. అవకాశం ఇస్తానంటూ అతడు ఆశచూపాడు. హైదరాబాద్కు పిలిపించుకొని ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అంతేకాదు బాధితురాలి నగ్న చిత్రాలను సెల్ఫోన్లో తీసి బెదిరించాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెళితే ముంబై పోలీసులు తమ పరిధిలోకి రాదని చెప్పడంతో ఆమ జనవరి 10న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ను కలిసింది. అయన ఆదేశంతో కరీం మొరానీపై ఐపీసీ 417, 376, 342, 506, 354 నిర్ఛయ యాక్ట్ కింద హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీం మొరానీ 2జీ స్పెక్ట్రం కేసులో కూడా నిందితుడు. బాధితురాలు కరీం కూతురుకు స్నేహితురాలని, ఆ సమయంలోనే వీరికి పరిచయం ఏర్పడింది. తనను ఏడాదిన్నరగా చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కరీంను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. బెయిల్ పై బయటకు వచ్చి, ఆమెపై బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు నిందితుడి బెయిల్ ను రద్దు చేసింది, వెంటనే అతను కోర్టులో లొంగిపోవాలని సూచించింది. దీంతో ఆయన హైదరాబాదులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com