Home > Sports > లాస్ఏంజిల్స్ లో 2028 ఒలింపిక్స్

లాస్ఏంజిల్స్ లో 2028 ఒలింపిక్స్

పద్మ రేసులో ధోని
ఇది విరాట్ శకం...

PARIS+LOS+ANGELES+OLYMPICS-apdunia2028 ఒలింపిక్స్ నిర్వహణ జాక్ పాట్ ను లాస్ ఏంజిల్స్ కొట్టేసింది. 2024లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు పారిస్ నగరం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తాజాగా సంకేతాలు జారీ చేసింది. అయితే పూర్తి స్థాయి వివరాలను ఒలింపిక్ కమిటీ త్వరలో వెల్లడించనుంది. నిజానికి 2024లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు లాస్ ఏంజిల్స్ బిడ్డింగ్‌లో పోటీ పడింది. అయితే అనూహ్యంగా ఆ అవకాశం పారిస్‌కు దక్కింది. దీంతో 2028 క్రీడలను లాస్ ఏంజిల్స్‌కు కేటాయించారు. ఇందులో భాగంగా ఒలింపిక్ కమిటీ నుంచి అదనపు నిధులను లాస్ ఏంజిల్స్ పొందనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ అంటే మామూలు విషయం కాదు. ఈ క్రీడల నిర్వహణ కోసం సుమారు రెండు బిలియన్ల డాలర్ల సహాయాన్ని ఒలింపిక్ కమిటీ లాస్ ఏంజిల్స్‌కు అందించనుంది.

భారత్ లో 2032?
ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్స్ నిర్వహణ అంటే మాటలు కాదు..అందుకు పటిష్ట ఆర్ధిక ప్రణాళిక అవసరం. అయితే భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది అంత సాధ్యం కాదన్నది క్రీడా నిపుణుల అంచనా. 2032 లో భారత్ లో ఒలంపిక్స్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని ఇప్పటికే భారత క్రీడా మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఒలింపిక్స్ నిర్వహించి ఆర్ధిక కష్టాలను ఎదుర్కొన్న దేశాలను చూస్తే మనలాంటి దేశం అందుకు అస్సలు సాహసించదని చెప్పక తప్పదు. ఒలింపిక్ నిర్వహించడం వల్ల ఆ దేశాలు లాభపడకపోగా నష్టాల పాలయ్యాయి. ఒకవేళ 2032 ఒలింపిక్ క్రీడలు ఇక్కడ నిర్వహించాలనుకుంటే దీనికి సంబంధించిన బిడ్డింగ్ 9 సంవత్సరాల ముందుగా అంటే 2023లో వేయాల్సి ఉంటుంది. ఈలోగా అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుందని క్రీడా మంత్రిత్వ శాఖ ఆలోచన.
ఒలింపిక్స్ నిర్వహణలో పెనవేసుకుని ఉన్న భారీ ఖర్చుల నేపథ్యంలో చాలా దేశాలు వాటికి ఆతిథ్యం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఈ సమయంలో గొప్పలకు పోయి మన దేశం ఉన్న ఆర్ధిక సంపత్తిని కాస్తా పోగొట్టుకుంటుందా..? లేక తెలివిగా వ్యవహరించి సున్నితంగా ఆ ఆఫర్ ని తిరస్కరిస్తుందా..? అనేది తెలియాలంటే కొంత కాలమే నిర్ణయిస్తుంది.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *