Home > Movies > వంద కోట్ల క్లబ్ కి చేరువలో జై లవకుశ

వంద కోట్ల క్లబ్ కి చేరువలో జై లవకుశ

రేప్ కేసులో బాలీవుడ్ నిర్మాత లొంగుబాటు
ఇప్పుడు డైరక్షన్ కాదు... నటనే పైనే దృష్టి

jai lava kusa-apduniaబాబీ డైరెక్షన్‌లో తెరకెక్కి, విడుదలైన తొలి రోజే సంచలనం సృష్టించిన జై లవ కుశ సినిమా రెండో రోజే రూ. 100 కోట్ల క్లబ్ మార్కుకి చేరువగా వెళ్లిందంటున్నారు ఫిలిం క్రిటిక్స్. ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేసిన ఈ సినిమా కలెక్షన్స్ సైతం అంతే రెట్టింపు స్థాయిలో వున్నాయి. డిస్టిబ్యూటర్లు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఫస్ట్ డే రోజే ఈ సినిమా రూ.48 కోట్లు రాబట్టిందంటూ ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమెయిర్ సంధు ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యధిక మొత్తంలో ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగానూ ‘జై లవ కుశ’ నిలిచిపోతుందని ఉమెయిర్ సంధు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.ఇదిలావుంటే, శుక్రవారం రాత్రి మరో ట్వీట్ చేసిన ఉమెయిర్.. ‘జై లవ కుశ’ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్టుగా తన ట్వీట్‌లో స్పష్టంచేశాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *