Home > General > వణికిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్

వణికిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్

చదలవాడ లక్ష్మణ్ సదావర్తి భూములు
కాళేశ్వరం ప్రాజెక్టు – II కు రు. 11,400 కోట్ల రూపాయల రుణo

kaleswaram projectవరస దుర్ఘటనలతో కాళేశ్వరం ప్రాజెక్టు వణికిస్తోంది. 2 రోజుల కిందట ఈ ప్రాజెక్టు సొరంగంలో పైకప్పు కూలి ఏడుగురు కూలీలు మృత్యువాత పడిన ఘటన మవరక ముందే గురువారం బండరాళ్లు మీదపడి అసోంకు చెందిన మరో కూలీ మృతిచెందాడు. తాజాగా శుక్రవారం మరో ప్రమాదం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఆరో ప్యాకేజీలో భాగంగా పెద్దపల్లి జిల్లా నందిమేడారం వద్దనున్న సొరంగంలో పనులు చేసేందుకు వెళ్తున్న ఐదుగురి కూలీలపై బండరాలు పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితులను కరీంనగర్‌ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపురం శివారులో ఏడో ప్యాకేజీ సొరంగం పనుల్లో గురువారం జరిగిన ప్రమాదంలో.. అసోంకి చెందిన దేవాజిత్‌ సోనోవాల్‌ మరణించాడు. తలపై బండరాయి పడటంతో తీవ్రంగా గాయపడిన దేవాజిత్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. సొరంగం తవ్వకం పూర్తయ్యాక బండరాళ్లను తొలగించే పని చేస్తుండగా.. పైభాగం నుంచి 10 కిలోలకు పైగా బరువున్న బండరాయి నేరుగా దేవాజిత్ తలపై పడింది. సొరంగంలో చోటు చేసుకుంటున్న వరస సంఘటనలతో కూలీలు ఠారెత్తిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *