Home > General > వసీమ్ అక్రమ్ కు అరెస్ట్ వారెంట్..ఎందుకు?

వసీమ్ అక్రమ్ కు అరెస్ట్ వారెంట్..ఎందుకు?

సంక్రాంతి సందడితో పల్లెలు
చైనాకు పక్కలో బళ్ళెంలా పాక్ ఉగ్రవాదులు

wasim akram_apduniaపాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ కు కరాచీలోని స్థానిక సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గత ఏడాది జరిగిన ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించి స్థానిక రిటైర్డ్ మేజర్ అమినుర్ రెహ్మాన్ పై వసీం అక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు దాదాపు 31 సార్లు ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ఇంతవరకు ఒక్కసారి కూడా వసీమ్ కోర్టుకు హాజరుకాలేదు. కోర్టుకు గైర్హాజరవుతున్న క్రమంలోనే వసీం అక్రమ్ కు కోర్టు బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే గత ఏడాది వసీం అక్రమ్ ప్రయాణిస్తున్న బెంజ్ కారును మాజీ మేజర్ తన కారుతో ఢీకొట్టాడు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న వాగ్వాదంలో వసీంను మేజర్ తన రివాల్వర్ తీసి బెదిరించాడు. ఈ క్రమంలో కొందరు పెద్దలు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఇద్దరూ కోర్టు విచారణకు హాజరుకావడం లేదు. ప్రస్తుతం తన జాతీయ జట్టుకు బౌలింగ్ కోచ్ గా ఉన్న అక్రమ్ జట్టుతో పాటు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. మరోవైపు ఇద్దరూ జనవరి 17న జరిగే తదుపరి విచారణకు హాజరు కావాల్సిందేనంటూ కోర్టు ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *