Home > Movies > విజయవాడ కుర్రాడితో రేష్మి పెళ్లి!

విజయవాడ కుర్రాడితో రేష్మి పెళ్లి!

డిఫరెంట్ పాత్రలో కనువిందు చేస్తున్న కాజల్
శోభన పెళ్లి చేసుకోబోతోందోచ్!

rashmi_apduniaనేను విజయవాడలో సెటిలవుతా అని యాంకర్ కమ్ నటి రేష్మి అన్న మాటలు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారాయి. రేష్మి మాటలను చూస్తుంటే ఆమె విజయవాడకు చెందిన ఓ కుర్రాడిని పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ విజయవాడ కుర్రాడు ఎవరయ్యా అంటే సుడిగాలి సుధీర్ అంటున్నారు. ఎటొచ్చీ మళ్లీ సుడిగాలి దగ్గరే ఆగుతున్నారు. ఆ మధ్య వీరిద్దరికీ అఫైర్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. అదే విషయాన్ని రష్మిని అడిగితే ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుకుంటారు.. తనకు పోయేదేముంది అంటూ కామెంట్ చేసింది. సుడిగాలి సుధీర్ తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని స్పష్టం చేశాడు. కేవలం స్కిట్లో నవ్వులను ఎక్కువుగా జోడించడానికి తనను రష్మితో లింక్ చేస్తుంటారని, అంతేకాకుండా తనకు అమ్మాయిల పిచ్చి ఉందన్నట్లు స్కిట్లు రాస్తుంటారని పేర్కొన్నారు. వీటి వల్ల తన క్యారెక్టర్ చాలా చెడ్డదన్న ప్రచారం జరిగిపోయిందని, దీంతో తనకు ఎవరూ పిల్లనివ్వడానికి కూడా ముందుకు రావట్లేదని నవ్వేశాడు. కేవలం కామెడీ కోసం వాడిన డైలాగులతో తనకు, రష్మీకి సంబంధం అంటగట్టేశారని అన్నాడు. నిజానికి చెప్పాలంటే తన జీవితంలో ఇంతకుముందే ఒకసారి లవ్ ఫెయిల్ అయిందని, తనకు పెళ్ళి చేసుకునే ఆలోచన కూడా లేదని వివరించాడు. ఇక తరచూ బ్రేక్ తీసుకుంటానని, రెండు రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటానని వివరించాడు. రేష్మి కూడా విజయవాడలో సెటిలవుతానంటే ఆంధ్రకు చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అర్థం కాదని అంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *