Home > Crime > వీడిన మహిళా డాక్ట‌ర్ మిస్సింగ్ మిస్ట‌రీ : కాలువలో డెడ్ బాడీ

వీడిన మహిళా డాక్ట‌ర్ మిస్సింగ్ మిస్ట‌రీ : కాలువలో డెడ్ బాడీ

పచ్చిమిరపకాయలను భార్య మర్మాంగంలో చొప్పించాడు
సోషల్ మీడియా కేంద్రంగా వ్యభిచారం

suryakumari_apduniaవిజ‌య‌వాడ‌లో మ‌హిళా ఐఏఎస్ సోద‌రి డాక్ట‌ర్ సూర్య‌కుమారి మిస్సింగ్ మిస్ట‌రీ వీడింది. రైవ‌స్ కాలువలో సూర్య‌కుమారి మృత‌దేహం దొరికింది. ఐదు రోజుల నుంచి నీళ్లలో ఉండ‌టం వ‌ల్ల మృత‌దేహం గుర్తుపట్టలేకుండా మారిపోయింది. కూతురి డెడ్‌బాడీ చూసిన త‌ల్లిదండ్రులు క‌న్నీరు మున్నీర‌య్యారు. కాల్వ‌ ఒడ్డున సూర్య‌కుమారి స్కూటీని చూసిన‌ట్లు స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం కాలువ‌లో గాలింపు ప్రారంభించారు. 27 మంది ప్ర‌త్యేక బృందం క‌లిసి 14 కిలోమీట‌ర్ల మేర గాలించి సూర్య‌కుమారి మృత‌దేహాన్ని వెలికితీశారు. సూర్య‌కుమారిది ఆత్మ‌హ‌త్యే అని పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ‌కు వచ్చారు. కృష్ణా జిల్లా విస్సన్నపేట క్లస్టర్‌ పరిధిలోని తెల్లదేవరపల్లి ఆరోగ్య కేంద్రంలో సూర్య‌కుమారి డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. నాలుగురోజుల కింద‌ట‌ అర్ధ‌రాత్రి సూర్య‌కుమారి ఇంటినుంచి వెళ్లింది. మాజీ ఎమ్మెల్యే జ‌య‌రాజు కొడుకు విద్యాసాగ‌ర్ ఇంటికి వెళ్లిన సూర్య‌కుమారి ఆ త‌ర్వాత నుంచి క‌నిపించ‌కుండా పోయింది. అంత‌కుముందు జ‌య‌రాజుకు సూర్య‌కుమారి ఓ మేసేజ్ పంపించిన‌ట్లు పోలీసు విచార‌ణ‌లో తేలింది. విద్యాసాగ‌ర్‌, సూర్య‌కుమారి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేశారు. విద్యాసాగ‌ర్ ఇంటికి రాత్రి ఒక‌టిన్న‌ర ప్రాంతంలో వ‌చ్చిన సూర్య‌కుమారి విద్యాసాగ‌ర్‌తో వాద‌న త‌ర్వాత ఆందోళనగా వెళ్లి కాల్వ‌లో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *