Home > World News > National > వీసా ఇవ్వకుండా వేధిస్తున్నారు

వీసా ఇవ్వకుండా వేధిస్తున్నారు

వారానికి ఆరు రోజులే పెట్రోల్ బంక్స్
వీసాలపై ఆందోళన వద్దు : నిర్మలా సీతారమన్

lilly-singh-tweets-visa_apduniaపాపులర్ కమెడియన్ లిల్లీ సింగ్ కెనడాలో తనకు ఇండియన్ వీసా జారీ చేసేందుకు భారతీయ కాన్సులేట్ కార్యాలయ సిబ్బంది నిరాకరిస్తూ తనను ఇబ్బందులు పెడుతున్నారని వాపోయింది. వారి తీరు చాలా ఘోరంగా, అన్ ప్రొఫెషనల్‌గా ఉందని ఆమె ఆరోపించింది. మరో రెండు వారాల్లో ఈమె టొరంటో నుంచి ఇండియాకు రావలసి ఉంది. అయితే ఏవో కుంటిసాకులు చెబుతూ భారతీయ వీసా ఇవ్వకుండా నాకు సమస్యలు తెచ్చి పెడుతున్నారు. ‘నాకు హెల్ప్ చేయండి’ అంటూ రెండు నిముషాల వీడియోలో ఆమె ప్రధాని మోదీకి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను అభ్యర్థించింది. ట్వీట్ చేసింది కూడా. ‘నేను తరచు టొరంటో నుంచి ఇండియాకు ప్రయాణిస్తుంటాను. కానీ ఈ సారి ఎందుకిలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడంలేదు’ అని లిల్లీ సింగ్ పేర్కొంది. దీనిపై స్పందించిన సుష్మస్వరాజ్.. కెనడాలోని భారత హై కమిషనర్ వికాష్ స్వరూప్‌ని సంప్రదించాల్సిందిగా ఆమెను కోరుతూ ట్వీట్ చేశారు. అవసరమైన సాయం అందగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *