Home > Vanitha > వ‌రుడ్ని వైద్యపరీక్షలకు పంపిన వ‌ధువు

వ‌రుడ్ని వైద్యపరీక్షలకు పంపిన వ‌ధువు

అతి చిన్న కండలరాణి
ఈమె ‘ఎత్తు’ ఎంతో తెలుసా?

marriage_apduniaఓ పంజాబీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి దిమ్మతిరిగే షాకిచ్చింది. తనను పెళ్లి చేసుకోడానికి వచ్చని వరుడుని వైద్యపరీక్షలకు పంపింది. ఈ ఘటన పంజాబ్‌లోని దీనానగర్ పట్టణంలో జరిగింది. వరుడు డ్రగ్స్ మత్తులో ఉన్నాడని వైద్యపరీక్షల్లో తేలడంతో ఇలాంటి వ్యక్తిని తాను పెళ్లి చేసుకునేది లేదని ఛీకొట్టి వెళ్లిపోయింది. గురుదాస్‌పూర్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో దసరా గ్రౌండ్ ప్రాంతానికి చెందిన ట్రక్ డ్రైవర్ కుమార్తె సునీతా సింగ్‌. ఈమెకు జస్‌ప్రీత్ సింగ్ అనే యువకుడితో పెళ్లి కుదిరింది. మహారాజా రంజిత్ సింగ్ గురుద్వారాలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే పెళ్లి చేసుకునేందుకు వచ్చిన వరుడి కాళ్లు కారు దిగుతుండగానే తడబడ్డాయి. అది గమనించిన వధువు సునీత అతడు బాగా డ్రగ్స్ తీసుకుని ఉన్నాడని గుర్తించింది. లారీ డ్రైవర్ అయిన జస్‌ప్రీత్ కాలికి గాయమవడంతో అడుగులు తడబడుతున్నాయని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదు. పెళ్లికొడుకును వెంటనే వైద్య పరీక్షలకు తీసుకెళ్లాలని కోరింది. ఒక పరీక్ష కేంద్రంలో వసతులు లేకపోవడంతో మరో కేంద్రంలో పరీక్షలు నిర్వహించి డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించారు. అంతే పెళ్లి పెటాకులైంది. వరుడు జైలుపాలయ్యాడు. పెళ్లికూతురిని ప్రశంసలతో ముంచెత్తారు బంధువర్గం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *