Home > Love Life > శృంగార సామర్థ్యం పెంచే 10 వంటింటి ఔషధాలు

శృంగార సామర్థ్యం పెంచే 10 వంటింటి ఔషధాలు

కారులో ప్రేమజంట రొమాన్స్‌.. గేరు మారడంతో సరస్సులోకి?
యూరోపియన్ దేశాల్లో సెక్స్ టాయ్స్ తోనే పని...

sexual problems_apduniaపని ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు, మద్యపానం, ధూమపానం వంటి అనేక కారణాల వల్ల నేడు చాలా మంది పురుషుల్లో శృంగార సామర్థ్యం లోపిస్తోంది. తద్వారా అనేక మంది సంతాన సాఫల్యతకు నోచుకోలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. వంటింట్లో ఉండే పలు పదార్థాలే శృంగార సామర్థ్యాన్ని పెంచే ఔషధాలుగా పనిచేస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మెంతులు
మెంతుల్లో సపోనిన్స్ అనబడే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను పెంచుతుంది. దీంతో శృంగార సామర్థ్యం పెరిగి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెంతులను తరచూ ఏదో ఒక రూపంలో తింటున్నా చాలు, ఆ శక్తిని పెంచుకోవచ్చు.
2. యాలకులు
యాలకులను మనం నిత్యం పలు రకాల స్వీట్ తయారీలో వాడుతాం. అయితే వీటిలో ఉండే సినియోల్ అనే పదార్థం పురుషుల్లో ఉత్తేజాన్ని పెంచుతుంది. దీంతో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. అలసట తగ్గుతుంది. తద్వారా ఇవి నపుంసకత్వాన్ని కూడా తగ్గిస్తాయి.
3. లవంగాలు
లవంగాలను చాలా మంది వంటల్లో వాడుతారు. వీటి వల్ల వంటకాలకు మంచి ఘాటైన రుచి, వాసన వస్తాయి. అయితే ఇవి పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. చురుగ్గా ఉండేలా చేస్తాయి.
4. సోంపు
భోజనం చేసిన తరువాత జీర్ణం సరిగ్గా అయ్యేందుకు చాలా మంది సోంపు వేసుకుంటారు. అయితే కేవలం జీర్ణ ప్రక్రియకే కాదు, శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా సోంపు ఉపయోగపడుతుంది. నిత్యం దీన్ని తింటున్నా చాలు, ఆ శక్తి పెరుగుతుంది. ప్రధానంగా అంగ స్తంభన సమస్య తొలగిపోతుంది.
5. జిన్సెంగ్
ఇది ఒక రకమైన మూలిక. దీని పొడి మనకు దొరుకుతుంది. జిన్సెంగ్‌ను రోజూ పాలలో కలుపుకుని తాగితే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.
6. కుంకుమ పువ్వు
గర్భిణులు పాలల్లో కుంకుమ పువ్వును కలుపుకుని తాగుతారు. దీంతో పుట్టబోయే పిల్లలు అందంగా, ఆరోగ్యంగా పుడతారని వారు భావిస్తారు. అయితే అందుకే కాదు, కుంకుమ పువ్వుకు శృంగార సామర్థ్యాన్ని పెంచే శక్తి కూడా ఉంది. చాలా మంది ఉత్తర భారత దేశంలో కుంకుమ పువ్వును రోజూ పాలలో కలుపుకుని తాగుతారు. పెళ్లయిన దంపతులకు పాలలో దీన్ని కలిపి ఇస్తారు. దీంతో ఆ శక్తి రెట్టింపు అవుతుంది.
7. జాజికాయ
పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణాలు జాజికాయలో ఉన్నాయి. వీటి పొడిని రోజూ పాలలో కలుపుకుని తాగితే ఆ శక్తి పెరగడమే కాదు, వీర్య వృద్ధి అవుతుంది. దీంతో సంతానం కలిగేందుకు అవకాశం ఉంటుంది. నరాల బలహీనత ఉంటే పోతుంది.
8. అశ్వగంధ
దీన్ని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని పిలుస్తారు. దీనికి శృంగార సామర్థ్యాన్ని పెంచే గుణం ఎక్కువగా ఉంది. నిత్యం కొంత అశ్వగంధ పొడిని పాలలో కలుపుకుని తాగుతుంటే కొద్ది రోజుల్లోనే మార్పు వస్తుంది. శృంగార సామర్థ్యం బాగా పెరుగుతుంది. ఉత్తేజంగా ఉంటారు. రతి క్రీడలో చురుగ్గా పాల్గొంటారు. కేవలం 15 రోజులు ఈ పొడిని వాడినా చాలు, చాలా తేడా వస్తుంది.
9. వెల్లుల్లి
మనం నిత్యం వెల్లుల్లిని పలు వంటకాల్లో ఉపయోగిస్తాం. కొందరు వెల్లుల్లిని పచ్చిగానే తింటారు. ఇలా తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. సంతానం కలుగుతుంది.
10. అల్లం
వెల్లుల్లి లాగే అల్లంను కూడా రోజూ మనం వంటల్లో వేస్తాం. దీంతో వంటలకు రుచి వస్తుంది. అల్లం రసాన్ని తీసి రోజూ తాగుతుంటే శృంగార సామర్థ్యం రెట్టింపు అవుతుంది. వీర్య వృద్ధి అవుతుంది. సంతానం కలిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *