Home > Movies > శోభన పెళ్లి చేసుకోబోతోందోచ్!

శోభన పెళ్లి చేసుకోబోతోందోచ్!

విజయవాడ కుర్రాడితో రేష్మి పెళ్లి!
చైనాలో ప్రమోషన్ కు బాహుబలి టీమ్

shobhana_apduniaఇన్నాళ్ళుగా వివాహమే వద్దంటూ నాట్యకళకు తనను అంకితం చేసుకున్న సినీ నటి శోభన 47 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేరళ జిల్లా తిరువనంతపురానికి చెందిన శోభన దక్షిణాది హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించింది. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. భరత నాట్య కళాకారిణిగానూ, నటిగానూ సినీ రంగంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ కొచ్చాడియన్‌లో శోభన నటించింది. దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలోనూ ఆమె నటించింది. 2001లో శోభన ఆనంద నారాయణీ అనే అమ్మాయిని దత్తపుత్రికగా స్వీకరించింది. ప్రస్తుతం శోభనకు 47ఏళ్లు. ఇలాంటి తరుణంలో స్నేహితుడు, ఫ్యామిలీ ఫ్రెండ్‌ను శోభన మనువాడనుందనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వ్యక్తి పేరు ఇంకా బయటికి రాలేదు. శోభన 2006లో పద్మశ్రీ అవార్డును గెలుచుకున్నారు. ఇప్పటికీ పలు క్లాసికల్ షోల్లో పాలుపంచుకుంటున్న ఆమె చెన్నైలో ఓ డ్యాన్స్ స్కూలును కూడా ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *