Home > Bhakti > శ్రీవారి భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..క్యూ కాంప్లెక్సుల్లో ఉచిత ఫోన్ సౌకర్యం

శ్రీవారి భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..క్యూ కాంప్లెక్సుల్లో ఉచిత ఫోన్ సౌకర్యం

కల్పవృక్ష వాహనంలో వూరేగిన స్వామివారు
ఇక వెండి బంగారంగానూ......

ttd q complex_apduniaతిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సుల్లో గంటల తరబడి వేచి ఉండే భక్తులు తమవారి యోగక్షేమాల గురించి టెన్షన్ పడుతుంటారు. వారితో మాట్లాడేందుకు వీరికి ఎలాంటి అవకాశమూ ఉండదు. మొబైల్ ఫోన్లను బయటే లాకర్స్‌లో పెట్టి దర్శనానికి వెళుతుండటమే ఇందుకు కారణం. ఈ ఇబ్బందిని గమనించిన టీటీడీ కొత్త ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులకు ఉచిత ఫోన్ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగా ఓ క్యూ కాంప్లెక్స్‌లో ఓ ఫోన్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. తొలుత కాయిన్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ చివరకు ఉచితంగా సేవలను అందించాలని నిర్ణయించారు. అయితే ఈ ఫోన్ కాల్ రెండు నిమిషాల సేపు మాత్రమే ఉంటుంది. రెండు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *