Home > Latest News > సంక్రాంతి బాదుడు షురూ…

సంక్రాంతి బాదుడు షురూ…

క్యాష్ లెస్ కోసం వంద రోజుల ప్రణాళిక
యాహూ పేరు మార్చుకుంటోంది
 train rusu_apduniaపెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ఇపుడు అదనపు ఛార్జీల వల్ల చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లలేని స్థితి నెలకొందంటున్నారు. గత ఏడాది తత్కాల్, ఫ్లాట్ పాం చార్జీలను మాత్రమే పెంచిన రైల్వే శాఖ సంక్రాంతిని పురస్కరించుకుని ఈసారి ఛార్జీలు పెంచకపోయినప్పటికీ ప్రత్యేక రైళ్లను తగినన్ని ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణీకుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అపుడే రైళ్లల్లో సంక్రాంతి రద్దీ పెరిగింది.  దీంతో సంక్రాంతి చార్జీల మోత మొదలైంది..ప్రైవేటు, ఆర్టీసీ యాజమాన్యాలు సంక్రాంతికి ప్రయాణీకులపై అదనపు చార్జీల వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. తగినన్ని రైళ్ళు లేకపోవడంతో సంక్రాంతి ప్రయాణీకులు అనివార్యంగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా ప్రైవేటు బస్సు యాజమాన్యాలు రద్దీకి అనుగుణంగా ఛార్జీల మోత మోగించేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి సుమారు రెండు వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రూ. రెండు వేల నోటుకు చిల్లర తిరిగి ఇచ్చే విధంగా ఎక్కడా ఛార్జీలు లేవని అంటున్నారు. ఈ నెల 11, 12, 16, 17 తేదీల్లో జిల్లా నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, విజయవాడ, తిరుపతి వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా కన్పిస్తోంది. దీంతో ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ఇదే అదనుగా ఛార్జీలు పెంచేశారంటున్నారు. ఈ తేదీల్లో టిక్కెట్లన్నీ ఎపుడో బుక్ అయిపోయాయని చెప్పి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ డీలక్స్ బస్సు చార్జీ రూ.555లు కాగా సంక్రాంతి స్పెషల్ బస్సు పేరుతో అదే దూరానికి రూ.825లు వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ చార్జి రూ.590 వుండగా, అది కాస్తా రూ.890 వసూలు చేస్తున్నారు. ఇంద్ర బస్సు చార్జీ రూ.775 కాగా సంక్రాంతి సందర్భంగా రూ.1100లకు పెంచారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ.175 కాగా ప్రస్తుతం రూ.260 వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ చార్జీ రూ.201, దీనిని రూ.360 వసూలు చేస్తున్నారు. గరుడ చార్జీ రూ.323 వుండగా రూ.500 వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఈ నెల 10న ఐదు ప్రత్యేక బస్సులు, 11న 9 బస్సులు, 12న 19 బస్సులు, 13న 5 బస్సులు వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. దూరాన్ని, ఖాళీలను బట్టి ఈ చార్జీలను వసూలు చేస్తున్నామని, ప్రజలపై భారాలు మోపేందుకు కాదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సంక్రాంతికి హైదరాబాద్‌కు మాత్రమే ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, మిగిలిన ప్రాంతాలకు యధావిధిగా బస్సులు నడుపుతున్నామని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *