Home > Health > స్తనాల (వక్షోజ) సైజు పెరగాలంటే ఇవి తినాల్సిందే!

స్తనాల (వక్షోజ) సైజు పెరగాలంటే ఇవి తినాల్సిందే!

మధుమేహ వ్యాధికి మెడిసిన్ రెడీ
తుది దశలో అమరావతి డిజైన్స్

beautiful breast_apduniaసాధారణంగా చాలా మంది మహిళలు తమకు స్తన సౌందర్యం అంతంత మాత్రంగా లేదా చిన్నవిగా ఉన్నాయని చాలా బాధపడిపోతుంటారు. తోటి స్నేహితులు చేసే కామెంట్స్ కారణంగా వారు లోలోపల కుమిలిపోతుంటారు. మరి కొందరు పురుష లక్షణాల వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటారు. నిజానికి స్తనాలు సన్నగా, చిన్నగా ఉండటానికి పలు కారణాలున్నాయంటారు వైద్యనిపుణులు. వంశపారంపర్యంగా తల్లి లేదా తండ్రి వైపు వారు సన్నగా ఉండటం ఒక కారణంగా పేర్కొంటారు. పౌష్టికాహార లోపం వల్ల, పోషణ సరిగా లేకపోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర ఖనిజాలు తగు మోతాదులో అందకపోవడం వల్ల, హార్మోన్ల సమతుల్యం లోపించడం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కూడా స్తనాలు చిన్నగా సన్నగా ఉంటాయని వైద్యులు చెబుతుంటారు. మహిళకు స్తనాల ప్రాధాన్యత ఎంతో ఉంది. బిడ్డకు జన్మనిచ్చిందంటే, పుట్టిన ఆ బిడ్డకు పాలు ఆమె వాటినుండే అందించాలి. అంతేకాదు మహిళకు అందం ఆమెకుగల స్తనాలే. మహిళ అనటానికి చిహ్నంగా ఆమెను చూడగానే మొదటి చూపులోనే అవి కనపడతాయి. మహిళలు ఈ అందాలను అనేక విధాలా సంరక్షించుకుంటారు. తమ స్తనాల సైజు అధికంగా వుండటానికి ఎంతో శ్రమ పడతారు. వ్యాయామాలు చేస్తారు. మందులు వాడతారు. మంచి ఆహారం తీసుకుంటారు. మరి కొంతమంది సినీ నటులు లేదా సెలబ్రిటీలు తమ స్తనాలను సర్జరీల ద్వారా కూడా పెద్దవిగా చేసుకొని మంచి శారీరక రూపాన్ని పొందుతారు. మహిళకు స్తనాలు చిన్నవిగా వుంటే నలుగురిలో నగుబాటే. స్తనాల సైజులు పెంచటానికిగాను చాలామంది ఈ విధంగా ఎంతో శ్రమపడతారు. కాని సహజ ఆహారాల ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. చికెన్ రెగ్యులర్ గా తింటే స్తనాలు సహజంగా పెరుగుతాయి. తాజా పండ్లు, ఈస్ట్రోజన్ అధికంగా వుండే కూరగాయలు, కాయ ధాన్యాలు, బార్లీ, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తింటే వక్షోజాలు సైజు పెరిగే అవకాశం వుంది. పెరుగు వంటి పాల ఉత్పత్తులు కూడా స్తనాల సైజులు సహజంగా పెంచుతాయి. ఛిక్ పీస్, కిడ్నీ బీన్స్, రెడ్ బీన్స్, బఠాణీ మొదలైన కాయ ధాన్యాలు తింటే స్తనాలు పెరిగేలా చేస్తాయి. సాధారణంగా చాలా మంది బీన్స్ అంటే బాగా తెలుసు. అయితే కిడ్నీ బీన్స్ అంటే కొంత మంది తెలియదు. గుడ్లు, చేప, మాంసం, పాలు కూడా స్తనాల పెరుగుదలకు సహకరిస్తాయి. మహిళ తాను యుక్త వయసు పొందినప్పటి నుండి పాల ఉత్పత్తుల ఆహారాలు అధికంగా తీసుకోవాలి. ఇవి ఆమెలో యుక్తవయసు నుండి వచ్చే శారీరక ఎదుగుదలను పెంచటానికి పనిచేస్తాయి. పచ్చని ఆకు కూరలు, ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా వుండే ఆహారాలు స్తనాల కణాలను వృధ్ధి చేస్తాయి. బీట్ రూట్, కేబేజి, కాలీఫ్వర్, కేరట్లు, ఉల్లి, కుకుంబర్, గుమ్మడి మొదలైనవి తినాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్స్, ప్రోటీనులు, మినిరల్స్ మరియు ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీర జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి. చెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు లో ఈస్ట్రోజన్ అధికంగా ఉంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చండి. కాఫీలు, కూల్ డ్రింక్ లు, ఉప్పు అధికంగా వుండే బేకరీ తిండ్లు అరికట్టాలి. ప్రతిరోజు అధికంగా నీరు త్రాగండి. నువ్వులు కూడా స్తనాల పెరుగుదలకు తోడ్పడతాయి. ప్రతిరోజూ స్తనాలకవసరమైన వ్యాయామం చేయాలి. ఈ ఆహారాలు, వ్యాయామాలతో మీ స్తనాలకు చక్కటి ఆకర్షణీయమైన షేపులనిచ్చి మహిళలుగా గర్వపడండి. ఆయుర్వేద ప్రకారం మెంతులు బ్రెస్ట్ సైజును పెంచడంలో చాలా సహాయపడతాయి. మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఆ నీటితో స్తనాల వద్ద మసాజ్ చేయాలి. ఇంకా ఆ నానిన మెంతులను మెత్తని పేస్ట్ చేసి ఆ పేస్ట్ ను కూడా మసాజ్ గా ఉపయోగించాలి. క్యారెట్ లోని కెరోటినాయిడ్స్ స్తన సౌందర్యం పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. జ్యూస్ కు బదులు క్యారెట్స్ అలాగే తినడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ఉల్లిపాయలు రక్త ప్రసరణను పెంచి స్తన వృద్దిని పెంచుతుంది. చిక్కుళ్ళకు, బీన్స్ కు అధిక ప్రాధాన్యత ఇస్తే స్తనాల కణాలను వృధ్ధి చేస్తాయి. సహజమైన వ్యాయామం ద్వారా రొమ్ము సైజులను పెంచుకోవచ్చు. కచ్చితమైన ‘పుష్ అప్’ వ్యాయామం ద్వారా వీటి పెరుగుదల అతి తక్కువ కాలంలోనే సాద్యమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *