Home > Crime > 24 అవర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు

24 అవర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు

ఆడు మగాడేరా బుజ్జీ
చిన్నపిల్లలు పాలు తాగాలి బాబూ.. మందు కాదు..

drunk-drive-test-apduniaమద్యం తాగి వాహనం నడిపారంటే పోలీసులకు పట్టుబడడం ఖాయం. మందుబాబుల కిక్కు దించేందుకు ఇక పగలు, రాత్రి అని తేడా లేకుండా హైదరాబాద్ పోలీసులు డ్రైంక్ అండ్ డ్రైవ్‌కు శ్రీ కారం చుట్టారు. తాజాగా సిగ్నల్స్ వద్ద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలు పెట్టారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లో తాగుబోతు అర్ధరాత్రి కారు నడుపుతూ ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళలను ఢీకొట్టిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను రాత్రి వేళల్లో ఉధృతం చేసినా… మందుబాబులు అప్పుడప్పుడు ప్రమాదాలకు కారణమవుతూనే ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రమాదాలు జరిగిన సమయంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నా.. ఇలాంటి కేసుల్లో మృతుల కుటుంబాలకు బీమా కూడా వచ్చే అవకాశాలుండడం లేదు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణం కావడంతో.. ఆ వాహనానికి ఉండే ఇన్సూరెన్స్ బాధితులకు అందని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను పూర్తి స్థాయిలో అరికట్టడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది ప్రమాదాలను తగ్గంచడంలో సక్సెస్ సాధించిన పోలీసులు… డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌లను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు నగరంలోని సిగ్నల్స్ వద్ద ఆకస్మాత్తుగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. పగలు, సాయంత్రం వేళల్లో సిగ్నల్స్ వద్ద ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌లు యథావిధిగా సాగుతుంటాయి. దానికి తోడు కొత్తగా ఇప్పుడు సిగ్నల్స్‌ను లక్ష్యంగా చేసుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ బృందాలు బుధవారం నుంచి రంగంలోకి దిగా యి. ఒక్కో సిగ్నల్ వద్ద ఒక ట్రాఫిక్ పోలీస్ బృందం ఉంటున్నది. సిగ్నల్ పడగానే అక్కడి పరిస్థితులను ఆధారంగా చేసుకొని బృందంలోని సిబ్బంది బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తారు. గ్రీన్ సిగ్నల్ పడగానే సిబ్బంది అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటారు. సిగ్నల్స్ రెడ్‌లైట్ పడే సమయంలోనే ఆ చౌరస్తాలో ఉండే సిబ్బంది ఒకే సారి నలుగురైదురికిపైగానే తనిఖీలు చేస్తారు. చౌరస్తాల వద్ద సిగ్నల్ పడగానే ఆగిపోయే వాహనాలను వరుసగా కాకుండా, అనుమానం వచ్చిన వారిని, ఒక్కో వరుసలో కొందరిని ఇలా బ్రీత్ అనలైజర్‌తో తనిఖీలు చేస్తారు. ఈ బృందాలు ఒక చౌరస్తాలో ఎంతసేపు ఉంటారనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఒకచోట నుంచి వెంటనే మరో చోటకు తనిఖీల ప్రాంతాన్ని మార్చేస్తారు. ఆయా ఏసీపీల పర్యవేక్షణలో ఈ తనిఖీలు కొనసాగుతుంటాయి. తనిఖీలలో బాడీ వార్న్ కెమెరాలు కల్గి ఉన్న ఎస్సై స్థాయి అధికారి సమక్షంలో జరుగుతాయి. ఈ తనిఖీల సందర్భంగా ఎవరైనా తప్పించుకొని పారిపోతూ ప్రమాదాల బారినపడకుండా ఉండేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకొని పోలీసు బృందాలు రంగంలోకి దిగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *