Home > World News > 31న పిఎస్‌ఎల్‌వి సి39 ప్రయోగం

31న పిఎస్‌ఎల్‌వి సి39 ప్రయోగం

కొరకరాని కొయ్యగా కిమ్ జాంగ్
నవంబర్లో హైదరాబాద్ కు ఇవాంకా ట్రంప్!

isroభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తలపెట్టిన నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. 31న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ షార్ కేంద్రం నుండి పిఎస్‌ఎల్‌వి సి39 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి చెందిన రిహార్సులను విజయవంతంగా నిర్వహించారు. మొబైల్ సర్వీస్ టవర్ నుండి రాకెట్‌ను వెనక్కు తీసుకొచ్చి అందులో పంపించే ప్రక్రియను శాస్తవ్రేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నిల్ ఇవ్వనున్నారు. 30వ తేదీ మధ్యాహ్నం 1.59 నిమిషాలకు ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ను ప్రారంభించనున్నారు. 29 గంటలు కౌంట్‌డౌన్ సజావుగా సాగిన అనంతరం పిఎస్‌ఎల్‌వి సి39 రాకెట్ ఈ నెల 31న సాయంత్రం 6.59 గం టలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నింగిలోకి ఎగరనుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *