Home > Crime > వామ్మో…భోపాల్

వామ్మో…భోపాల్

విజయ్ మాల్యా కోసం జైలు సిద్ధం
పది నెలల్లో ఆటో ప్రమాద మృతులు 67
 
gang rape_apduniaపదేళ్ల బాలికకు స్వీట్లు ఆశగా చూపి నలుగురు వ్యక్తులు మూడు నెలలుగా అనేకమార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. అయిదో తరగతి చదువుతున్న బాలికపై.. వాచ్‌మన్‌గా పని చేస్తూ అదే కాలనీలో నివాసం ఉంటున్న నన్హూలాల్‌ (60), మరో ముగ్గురు వ్యక్తులు గోకుల్‌ పన్వాల్‌ (42), గ్యానేంద్ర పండిట్‌ (34), సుమన్‌పాండే (49) గత 3 నెలలుగా అఘాయిత్యానికి ఒడిగట్టారు.చివరిసారిగా ఆ బాలికపై నిందితులు నవంబర్‌ 12న అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన ఆమె తల్లి ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆ బాలిక ఇంటి పక్కనే ఉండే సుమన్‌ స్వీట్లను ఆశ చూపి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అంగీకరించాడు.నలుగురి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. నగరం నడిబొడ్డున ఓ యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఉదంతం మరవక ముందే మరో దారుణం చోటు వెలుగులోకి రావడంతో భోపాల్ వాసులు భీతిల్లిపోతున్నారు.
Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com