Home > Politics > జగన్ కు సపోర్ట్ చేయని జెండా

జగన్ కు సపోర్ట్ చేయని జెండా

బాబులో నయా జోష్....
గుజరాత్ లో మోడీ వర్సెస్ రాహుల్

ys-jagan-mohanreddy-apduniaవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి మహా సంకల్ప యాత్రలో భాగంగా జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపికైంది. యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ చేరుకున్నప్పటి సంఘటన ఇది. అక్కడ జగన్‌మోహరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పార్టీ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు జగన్. అది ఎంతసేటికీ పైకి ఎగరలేదు. ఫలితంగా జగన్ లో అసహనం కనిపించింది. పాదయాత్రలో భాగంగా ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరులో చోటు చేసుకుందీ చిత్రం. అక్కడ ఏర్పాటు చేసిన వైసీపీ జెండాను ఆవిష్కరించేందుకు జగన్ ప్రయత్నించారు. అయితే అది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎగరలేదు. దీంతో జగన్ తీవ్ర అసహనానికి గురయ్యారు.డాను సరిగా తాడుకు బిగించక పోవడమే ఇందుకు కారణం. ముడి వేయడం సరిగా చేతగాక జగన్ ను అభాసుపాలు చేశారు అక్కడి కార్యకర్తలు. జగన్ పరిస్థితిని గమనించిన కార్యకర్తలు చివరికు ఓ బాలుడిని స్తంభంపైకి ఎక్కించారు. ఆ తర్వాత జెండాను ఎగురవేశారు. హమ్మయ్యా అంటూ మిగతా వారు ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com