Home > Tirumala News > ఒక శాస్త్రీయంగా వెంకన్న దర్శనం

ఒక శాస్త్రీయంగా వెంకన్న దర్శనం

నిఘా కెమెరాలతో చిక్కుతున్నారు...
ఆగస్టు 7 న శ్రీవారి ఆలయం మూపివేత
 
ttd tickets_apduniaతిరుమల వెంకన్న వారి దర్శనం ఇకపై శాస్త్రీయంగా నిర్వహించాలని టీటీడీ దేవస్థానం సంకల్పిం చింది. దర్శనం టికెట్ల కేటాయింపుల్లో అక్రమాలను అరి కట్టడం, ఆలయంతో పాటు భక్తుల సెక్యూరిటీ, ఎక్కువసార్లు భక్తులు రాకుండా నియంత్రించడం, అందరికీ దర్శనభాగ్యం కల్పించడం ధ్యేయంగా చర్యలు తీసుకోనున్నారు. ముందుగానే రిజర్వ్ చేసుకుని కేటాయించిన సమయంలోనే స్వామి వారిని దర్శంచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గదులు కాటేజీల కేంద్రాలు, విఐపీ బ్రేక్ దర్శనాల కేటాయింపు, ఆర్జిత సేవల్లో ఇప్పటికే ఇంప్లు మెంట్ చేశారు. టీటీడీ ఎన్ని ఏర్పాట్లు చేసినా ఈ రద్దీని నియంత్రించడంలోనూ, వచ్చిన భక్తులకు సంతృప్తికర దర్శనం చేసి పంపడంలోనూ నిత్యం విఫలమౌతూనే ఉన్నారు. క్షణకాలం కూడా స్వామి వారిని చాలా మంది భక్తులు దర్శించలేని పరిస్థితి. ఆలయంలో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా సామాన్య భక్తులు మాత్రం స్వామి వారిని దగ్గర నుంచి కనులారా చూడలేని పరిస్థితి. దీంతో తిరుమలకు వచ్చిన భక్తులు చాలా మంది ఎంతో నిరాశతో తిరిగి వెలుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రస్తుత టీ.టీ.డీ అదికారులు భక్తులను నియంత్త్రించే ఆలోచనలో ఉన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చేవారందరికీ ఆధార్ కార్డు  వర్తింప చేసి సమగ్రడేటాను సేకరించాలని టీటీడీ భావిస్తోంది. తిరుమల, తిరుపతిలో ఉండే స్థానికుల్లో ఐదు వేల మందికి ప్రతినెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనానికి అనుమతి స్తున్నారు. దర్శనానికి ఒక సారి వచ్చినవారు తిరిగి మూడు నెలలులోపు రాకుండా ఆధార్ నంబర్ తో గుర్తించి నియంత్రించేం దుకు ఏర్పాట్లు చేశారు.  ఆధార్ కార్డు సేకరణ వెనుక అసలు కథ స్వామి దర్శనంలో కోటా పద్ధతి దాగుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్థానికులకు అమలు చేసే కోటా దర్శన విధానమే భవిష్యత్లో యాత్రికులకు వర్తింప చేయాలని టీటీడీ భావిస్తోందని సమాచారం. దీనివల్ల ముఖ్యంగా టికెట్ల కేటాయింపు, లడ్డూల విక్రయాల్లో దళారులను అరికట్టడం, వీఐపీలతో పాటు ఇతరులు ఎక్కువ సార్లు రాకుండా నియంత్రించడం వీలవుతుందన్నది అదికారుల ఆలోచన. అయితే,  ఇలాంటి విదానాలను భక్తులు వ్యతి రేకిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకోవడానికి ఇన్ని నిభంధనలు అవసరం లేదని, వచ్చిన వారిని వచ్చినట్టు దైవ దర్శనానికి పంపితే ఏటువంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *