Home > Health > అరటి పండు టీతో నిద్రలేమి మటుమాయం

అరటి పండు టీతో నిద్రలేమి మటుమాయం

మొటిమలు వస్తే అదృష్టమట
ముల్బెర్రీలతో ఉపయోగాలెన్నో!

banana tea_apduniaనిద్రలేమితో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇబ్బంది పడే ఉంటారు. ఎంతో కష్టపడి ప్రయత్నిస్తే గానీ కొన్ని గంటలైనా నిద్రపట్టదు. అలా కునుకు పట్టిందో లేదో అప్పుడే సూర్యుడు తలుపు తట్టేస్తుంటాడు. ఈ సమస్యకు అమేజింగ్ సొల్యూషన్ దొరికింది. నిద్రలో సమస్యలు రావడాన్ని ఇస్నోమియా అంటారు. పెయిన్ కిల్లర్స్, హార్ట్, బ్లడ్ ప్రెజర్ మందులు కూడా నిద్రరాకపోవడానికి కారణమవుతాయి. కాబట్టి నిద్రపట్టడానికి న్యాచురల్ హోం రెమెడీస్ ఫాలో అయితే కాస్త మెరుగైన ఫలితాలు పొందవచ్చు. అరటిపండు టీ ఇది వినడానికి కొత్తగా ఉంది కదూ. ఇది చాలా హెల్తీగా, టేస్టీగా ఉంటుంది. మీరు హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అరటిపండు తొక్కలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి నిద్రలో అసౌకర్యాలను తొలగిస్తాయి. ఈ టీ తయారు చేయడానికి 10 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది. కాబట్టి ప్రతిరోజూ నిద్రకు ముందు దీన్ని తాగి చూడండి..
కావాల్సిన పదార్థాలు..
ఒక అరటిపండు, కప్పు నీళ్లు, చిన్న దాల్చిన చెక్క
తయారు చేసే విధానం..
అరటి పండు రెండు చివర్లు కట్ చేసుకోవాలి. తొక్కతో పాటే మరుగుతున్న నీటిలో వేయాలి. 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఒక గ్లాసులోకి వడకట్టుకోవాలి. ఒకవేళ ఫ్లేవర్ కావాలి అనుకుంటే కొద్దిగా దాల్చిన చెక్క పొడిని టీపై చల్లుకోవాలి. దీన్ని రాత్రి నిద్రపోవడానికి గంట ముందు తాగాలి. ఒకవేళ అరటిపండు వేస్ట్ అవుతుందని భావిస్తే ఉడికించిన తర్వాత.. దాల్చిన చెక్క పొడి చల్లుకుని మొత్తం అరటిపండుతో పాటు నీటిని కూడా తీసుకోండి. వెచ్చగా ఉన్నప్పుడే తీసుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఇది తాగిన గంట తర్వాత హాయిగా, హ్యాపీగా నిద్రపోతారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *