Home > Politics > మళ్లీ బెజవాడ తెరపైకి గౌతమ్

మళ్లీ బెజవాడ తెరపైకి గౌతమ్

సౌత్ లో మోడీ తంత్రం వర్క్ వుట్ అవుతుందా
తలొక దారిలో ఆంధ్రా కమలం

gautam-reddy-ysrcp-apduniaపిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు ఉంది విజయవాడలో వైకాపా పరిస్థితి. అసలే విజయవాడ సీటు విషయంలో అటు వంగవీటి రాధా, ఇటు మల్లాది విష్ణులు పోటీ పడుతున్నారు. మధ్యలో ఇప్పుడు గౌతంరెడ్డి వచ్చారు. వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుండి సస్పెండ్‌ అయిన వైసీపీ నేత గౌతమ్‌రెడ్డి తిరిగి క్రియాశీలకం అవుతున్నారు. నెల్లూరులో జరిగిన జగన్‌ సంకల్పయాత్రకు రావడమే కాదు… ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడటం ఇప్పుడు సంచలనంగా మారింది. పార్టీ నుండి సస్పెండ్‌ అయిన సెంట్రల్‌ వైసీపీ నేత గౌతంరెడ్డి జగన్‌ తో పాదయాత్రలో ఏం మాట్లాడారు అనేది ఆసక్తికరమే. వంగవీటి ఎలాగు పార్టీ వీడతారనే సంకేతాలు వచ్చాయా లేక మరో కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. వంగవీటి కోసం గౌతంరెడ్డిని పక్కన పెట్టిన జగన్ ఇప్పుడు అతన్ని తిరిగి పిలిపించారా లేక అతనే వచ్చి కలిశారా అనేది ఇంకా తెలియదు. వంగవీటి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాడని.. అందుకే గౌతం రెడ్డిని పిలిపించారనే వాదన సాగుతోంది. విజయవాడ వైసీపీలో ఏదో జరగబోతుందనే సంకేతాలు వస్తున్నాయి. వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులను వదులుకునేందుకు జగన్ సిద్దంగా లేరంటున్నారు. అవసమరమైతే వంగవీటి రాధాను పక్కన పెడతారు తప్ప… సీనియర్ల మాట కాదనే స్థితిలో జగన్ లేరంటున్నారు. మాటి మాటికి అలిగే వాడిని పార్టీలో పెట్టుకోవడం కంటే బయటకు పంపడమే ఉత్తమం అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వంగవీటికి మచిలీపట్నం ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఇందుకు ఆయన ససేమిరా అంటున్నారట. అయితే టీడీపీలోను అదే సీటు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *