Home > Movies > మరో రికార్డ్ క్రియేట్ చేస్తున్న పవన్

మరో రికార్డ్ క్రియేట్ చేస్తున్న పవన్

రూ.50 కోట్ల క్ల‌బ్‌లోకి నాని ఎంసీఏ
కామ సూత్ర అంటూ ముందుకొస్తున్న జుడ్వా 2

pawan-kalyan-agnathavasi-apduniaఅమెరికాలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ అరుదైన ఘనత సాధించనుంది. అలాగే, మరో అరుదైన ఘనత కూడా సొంతం చేసుకోడానికి సిద్ధమవుతోంది. అమెరికాలోని అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లోని యూనివర్శల్‌ స్టూడియోస్‌లోని సిటీ వాక్ థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. దీంతో, అక్కడ ప్రదర్శించబోయే తొలి భారతీయ చిత్రంగా ‘అజ్ఞాతవాసి’కి గుర్తింపు లభించనుంది.దీనికి సంబంధించిన పోస్టర్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. 2018 జనవరి 9న ఈ చిత్రాన్ని సిటీ వాక్‌ థియేటర్స్‌లో ప్రదర్శించనున్నట్లు ఆ పోస్టర్లో ఉంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంంలోని పాటలకు ఇప్పటికే మాంచి రెస్పాన్స్ వచ్చింది.ఇండియాలో జనవరి 10న విడుదల కానున్న ఈ సినిమా అమెరికాలో దాదాపు 209 లోకేషన్లలో సుమారు 547 స్క్రీన్లపై ప్రదర్శించనున్నట్లు తెలిసింది. అంటే, ‘బాహుబలి 2’ సినిమా ప్రదర్శించిన లోకేషన్ల కంటే ఎక్కువ. ‘బాహుబలి-2’ అక్కడ 140 లొకేషన్లలో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా ‘అజ్ఞాతవాసి’ క్రెడిట్ కొట్టేస్తున్నాడు. మున్ముందు ‘రికార్డు’ల్లో కూడా పవన్ పవర్ చూపిస్తాడంటూ ఆయన అభిమానులు మురిసిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com