Home > General > మళ్లీ ఉల్లి లొల్లి

మళ్లీ ఉల్లి లొల్లి

విశాఖ ఏజెన్సీలో అంత్రాక్స్
కౌంటర్‌ ఇచ్చిన స్మృతి

oninons-apduniaఉల్లి ధర మళ్లీ దారుణంగా పడిపోయింది. పంట సాగు చేసిన రైతన్న కంటకన్నీరు పెట్టిస్తోంది. మొన్నటి వరకు అమాంతం పెరిగిన ధరలతో వినియోగదారులను ఏడిపించిన ఉల్లి.. ప్రస్తుతం రైతులను ఆర్ధికంగా దెబ్బతీస్తోంది. హైదరాబాద్ లోని మలక్ పేట మార్కెట్ కు… ఏపీలోని మంత్రాలయానికి చెందిన రైతులు భారీ స్థాయిలో ఉల్లిగడ్డలను తీసుకొచ్చారు. మూడు రోజుల క్రితం వరకు క్వింటాకు రూ.3వేలు ధర పలికింది.క్వింటా ఉల్లిగడ్డలను రూ.500 నుంచి 700 రూపాయలకు మించి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు మొగ్గు చూపలేదు. ఒక్క రోజులోనే ఉల్లి ధర అమాంతం పడిపోవటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి ఇక్కడికి ఉల్లిని తీసుకొచ్చిన రైతులు.. సరైన ధర లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్ధతు ధర కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు.రైతుల దగ్గర కొనుగోళ్లకు మాత్రం క్వింటా వెయ్యి రూపాయల కంటే పలకటం లేదు. అయితే బహిరంగ మార్కెట్ లో మాత్రం కిలో 30 రూపాయలు పలుకుతుంది. రైతు మార్కెట్ – బహిరంగ మార్కెట్ మధ్య ఇంత వ్యత్యాసం ఉండటంపైనా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కావాలనే రైతుకి ధర తగ్గిస్తున్నారని ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *