Home > General > అరకొరగానే సాగర్ నీరు

అరకొరగానే సాగర్ నీరు

కలకలం రేపుతున్న సెల్ఫీ సూసైడ్ నోట్
బెజవాడ కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ పనులు సాగుతున్నాయ్...

nagarjuna-sagar-waterనాగార్జున సాగర్ నీటి సరఫరా విషయంలో ప్రకాశం జిల్లాకు మరోసారి అన్యాయమే జరుగుతోంది. ప్రస్తుతం ఆరుతడి పంటలకు విడుదల చేసిన నీటి పంపిణీ చూస్తే…ఈ విషయం అర్థం అవుతుంది. నాగార్జునసాగర్ నుంచి ఇప్పటి వరకూ 4 టీఎంసీల నీరు విడదల చేస్తే… అందులో ఒక్క టీఎంసీ కూడా జిల్లాకు చేరలేదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.నీటి తడి అందక పంటలు ఎండుతుండటంతో ప్రకాశం జిల్లా రైతులు తల్లడిల్లుతున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు మాట్లాడకపోటంపై రైతులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నీటి నుంచి గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఇస్తామన్న అర టీఎంసీ నీరు రాక కూడా అనుమానంగా మారింది. మరోవైపు జిల్లాకు ఎగువన ఉన్న గుంటూరు జిల్లా రైతులకు మద్దతుగా ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. సాగర్ జలాశయంలో నీరు లేక…ప్రకాశం జిల్లా ఆయకట్టులో రెండేళ్లుగా మాగాణి సాగు జరగలేదు. కనీసం ఆరుతడి పంటలకైనా నీరు ఇవ్వాలని రెండు నెలల క్రితమే ప్రజా ప్రతినిధులతో కలిసి రైతులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. సాగర్ రిజర్వాయర్ లో 220 టీఎంసీల నీరు అందుబాటులోకి రావటంతో దీంతో వరిసాగుకు నీరు వస్తుందని రైతులు ఆశపడ్డారు. కానీ… తెలంగాణతో వివాదం, కృష్ణాబోర్డు అనుమతి, భవిష్యత్ తాగునీటి అవసరాల చిక్కుముడులతో మాగాణి సాగుకు నీరు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది. కుడి కాలువ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న ఆరు లక్షల ఎకరాల ఖరీఫ్ పంటలకు ఒక తడి కోసం నవంబరు 2 నుంచి నీటిని విడుదల చేశారు. ఈ విడత 9 టీఎంసీల నీరు రానుండగా అందులో 60శాతం గుంటూరు, 40 శాతం ప్రకాశం జిల్లాకు ఇచ్చేలా అధికారులు ప్రణాళిక వేశారు. ఆ ప్రకారం నాలుగు టీఎంసీల నీరు ప్రకాశం జిల్లాకు రావాల్సి ఉంది. ఎగువన అక్రమ వాడకం నిరోధిస్తే కానీ…జిల్లాలో పంటలకు ఒక తడి కూడా అందడం మాత్రం కనాకష్టమే. జిల్లాలో పరిస్థితి ఇంత అందోళనకరంగా ఉంటే ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదు. దీనిపై అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో మాత్రం వారికే తెలియాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *