Home > Crime > ఆరుషి హత్యకేసులో హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

ఆరుషి హత్యకేసులో హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

సీబీఐ కోర్టుకు హజరయిన జగన్, గాలి జనార్ధన రెడ్డి
250 వెబ్ సైట్లకు నోటీసులు

arushi-murder-apdunia-తల్లిదండ్రులు నిర్దోషులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు రాజేష్, నుపుర్ తల్వార్లు నిర్దోషులని అలహాబాద్ హైకోర్టు గురువారం నాడు తీర్పు చెప్పింది. తల్వార్లు తమ కుమార్తెను హత్య చేయలేదని, కేవలం అనుమానంపై నేరస్థులుగా ధృవీకరించలేమని హైకోర్టు పేర్కొంది. అలహాబాద్ హైకోర్టులలో న్యాయమూర్తులు కోర్టు హాల్లోకి 2 గంటల 45 నిముషాలకు వచ్చారు. 2 గంటల 48 నిముషాలకు తీర్పు కాపీపై సంతకాలు చేశారు. ఆరుషి హత్య కేసులో తీర్పు సందర్భంగా అలహాబాద్ హైకోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ క్రిక్కిరిసిపోయింది.
పద్నాలుగేళ్ల ఆరుషి తల్వార్ 2008లో తన ఇంట్లోనే హత్యకు గురైంది. ఆరుషి హత్య తరువాత ఆ ఇంట్లో పనిచేసే హేమరాజ్ అదృశ్యం కావడంతో అతడే హత్య చేశాడని తొలుత భావించారు. అయితే రెండు రోజుల అనంతరం ఆదే ఇంటిమీదున్న నీటి ట్యాంకు లో అతడి మృతదేహం లభ్యమైంది. పలు మలుపులు తిరిగిన ఈ కేసును విచారించిన సిబిఐ కోర్టు 2013లో ఆరుషి తల్లిదండ్రులు తమ కుమార్తెను హత్య చేశారని తీర్పు చెప్పింది. గ‌త తొమ్మిదేళ్లుగా దాస్నా జైలులో ఉన్న త‌ల్వార్ దంపతులు విడుద‌ల కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com