Home > Editorial > ఉమ్మడి అజెండాతో వాయిస్ పెంచుతున్న ప్రతిపక్షాలు

ఉమ్మడి అజెండాతో వాయిస్ పెంచుతున్న ప్రతిపక్షాలు

మళ్లీ తెరపైకి డిటెన్షన్ విధానం
మహానందీశ్వరా.....భూములకు దార్లు వెతుకుతున్నారు...

united-apposition-apduniaపెద్ద నోట్ల రద్దు తరువాత దేశాన్ని ఆర్థిక సంక్షోభం లోకి నెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ తన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశాయి. పెద్దనోట్ల రద్దు తరువాత దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి డిసెంబర్‌ 30 వరకూ తనకు గడువు ఇవ్వాలని కోరిన నరేంద్ర మోడీ ఆ తరువాత రాజీనామా చేస్తారా అని నిలదీశాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో 8 ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీని అభిశంసించాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని రాజీనామా కోరిన వారిలో మొదట నిలిచారు. నవంబర్‌ 8న ప్రధాని దేశ ప్రజలను డిసెంబర్‌ 30 వరకూ వేచి చూడాలని కోరారు. ఇక మూడు రోజులే గడువు ఉంది. ఈ లోగా సాధారణ పరిస్థితులు నెలకొనని పక్షంలో మోడీ రాజీనామా చేస్తారా? అని మమతా బెనర్జీ నిలదీశారు. మోడీ రాజీనామా చేయకుంటే.. ఆయన రాజీనామా చేసే విధంగా తాము ఒత్తిడి తెస్తామని కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ ప్రకటించారు. పెద్దనోట్ల రద్దుపై ప్రధానితో పోరు సాగించేందుకు తాము కనీస ఉమ్మడి అజెండా సిద్ధం చేస్తున్నట్లు రాహుల్‌ గాంధీ, మమతా బెనర్జీ ప్రకటించారు. రాహుల్‌ గాంధీ ఇదే వేదికపై మోడీ అవినీతి అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు. మోడీ ముడుపులు అందుకున్నట్లు స్పష్టం చేసే డాక్యుమెంట్లు ఎదురుగా ఉన్నప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని కేంద్ర సర్కార్‌ను నిలదీశారు.

డీమానిటైజేషన్‌కు సంబంధించి కొన్ని పార్టీలలో కొన్ని విబేధాలు ఉన్నప్పటికీ, ఆ పార్టీలన్నీ సమైక్యంగా ఉన్నాయని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ప్రతిపక్షాలు అన్నీ ఒకే వైఖరిలో ఉన్నాయని. అన్ని ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యంలో పరిపూర్ణ విశ్వాసం తో ముందుకు సాగుతున్నాయని, తాము కనీస ఉమ్మడి కార్యాచరణతో సాగు తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు.నవంబర్‌ 8న ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేశారు. ఒక్కసారిగా చేతిలో ఉన్న పెద్ద నోట్లు చెల్లకుండా పోవడంతో దేశవ్యాప్తంగా గగ్గోలు మొదలైంది. సామాన్య ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు, పెద్ద నోట్లకు బదులు చిన్న, చిల్లర నోట్లు అందక అల్లల్లాడారు. బ్యాంకులు, ఏటీఎంల ఎదుట క్యూ కట్టారు. చిన్న నోట్ల కోసం క్యూలలో దాదాపు వంద మంది వరకూ జనం చనిపోయారు. ఆ ఘటనల తరువాత ప్రతిపక్షాలు మేలుకొన్నాయి. దేశంలో పేద, బలహీన వర్గాలు, సామాన్యులు కరెన్సీ కోసం కటకట లాడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ వేర్వేరుగా ప్రధాని నరేంద్ర మోడీ పైనా, ఎన్డీఏ ప్రభుత్వం పైన ధ్వజమెత్తాయి. నిజానికి ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలన్నీ సమైక్యంగా మోడీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇదో సువర్ణ అవకాశం లభించింది. కానీ, ప్రతిపక్షాలు తమలో ఉన్న విభేదాలు, అహంకారం, ఇగో సమస్యల వల్ల సమైక్యంగా ప్రభుత్వాన్ని నిలదీయలేక పోయాయి. నడుం బిగించాల్సిన కాంగ్రెస్‌ కూడా నాయకత్వం అవగాహనా రాహిత్యం కారణంగా ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే కృషి చేయలేక పోయింది. పార్లమెంటు శీతాకాలం సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకత్వంలో ప్రతిపక్షాలు సభలను స్తంభింపజేశాయి. నరేంద్ర మోడీ బడా నోట్ల రద్దు చర్యను దుమ్మెత్తి పోశాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా కనిపించిన ప్రతిపక్షాల సమైక్యత ఆ తరువాత కనుమరు గయింది. ప్రతిపక్షాలు రింగ్‌ మాస్టర్‌ లాంటి కాంగ్రెస్‌ను విడిచిపెట్టేశాయి. అయితే ఆ తరువాత పరిస్థితులు క్రమంగా మారుతూ వచ్చాయి.

గుజరాత్‌ వేదికగా కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా చేసిన అవినీతి ఆరోపణలు సంచలనం రేపాయి. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ 2013-14 సంవత్సరాలలో సహారా, బిర్లా వంటి కార్పొరేట్‌ సంస్థల నుంచి రూ. 65 కోట్ల మేరకు ముడుపులు అందుకున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించడమేకాక కొన్ని సాక్ష్యాధారాలను, రుజువులను చూపడం ద్వారా ప్రజల దృష్టిని ఆకట్టుకోగలిగారు. ఆ ఆరోపణలను నరేంద్ర మోడీ ఖండించకపోవడం, కేంద్ర మంత్రులు ఎదురు దాడులకు దిగడం, సామాన్య జనంలో ఈ ఆరోపణలు నిజమై అయి ఉంటాయనే అనుమానాలకు తావు నిచ్చాయి. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఈ ఆరోపణల విచారణను సీబీఐకి అప్పగించడమో, న్యాయ విచారణకు ఆదేశించడమో చేసి తన నిజాయతీ నిరూపించుకోవల్సిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ ఆరోపణలపై బొత్తిగా స్పందించకపోవడం ప్రజల అనుమానాలను మరీ పెంచింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మళ్లీ సంయుక్త ప్రెస్‌ కాన్ఫరెన్‌‌స ఏర్పాటు చేసి అన్ని ప్రతిపక్ష పార్టీలను ఒక తాటి పైకి తెచ్చే యత్నం చేశారు. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆర్జేడీ, ఇతర చిన్న చితక పార్టీలు సంయుక్త ప్రెస్‌ కాన్ఫరెన్‌‌సలో పాల్గొన్నాయి. ఈ తరుణంలోనూ కొన్ని ప్రధాన ప్రతిపక్షాలు తమ చిత్తశుద్ధి నిరూపించేందుకు ముందుకు రాలేక పోయాయి. వామపక్షాలు తాము హాజరు కాలేమని ప్రకటించాయి. జేడీయూ అదే బాటలో నడిచింది. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ కనీసం తాము ఎందుకు రాలేకపోతున్నామో చెప్పలేదు. ఎన్‌సిపి నేత తారిక్‌ అన్వర్‌ ఈ సమావేశానికి వచ్చేందుకు సిద్ధమైనా తల్లి హఠాన్మరణంతో రాలేకపోయారు. కొన్ని పార్టీలు ఏదో కారణాలతో ఈ మీటింగ్‌కు రాలేక పోయాయని, భవిష్యత్‌లో వస్తాయని కాంగ్రెస్‌ నాయకుడు జైరాం రమేశ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *