Home > Vanitha > Beauty > కలబందతో చర్మం కాంతివంతం…

కలబందతో చర్మం కాంతివంతం…

మొక్కజొన్నగింజల కబాబ్...
బెండి పకోడీ....

aloeveera-lemon-apduniaఎండలో ఎక్కువగా తిరిగినప్పుడు చర్మంపై టాన్ పెరిగిపోతుంది. అలాంటి సమయంలో కలబంద గుజ్జులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి దాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసుకుంటే నలుపుదనం తగ్గుతుంది. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. కలబంద గుజ్జులో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి, దాన్ని ఎండలో తిరిగి ఇంటికి వచ్చాకా ముఖానికి రాసి మృదువుగా రుద్దాలి. ఈ విధంగా చేయుట వలన చర్మం తాజాగా మరియు కాంతివంతంగా ఉంటుంది. కలబంద గుజ్జులో కొంచెం పసుపు, ఒక స్పూన్ తేనే పాల మీగడ, రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసి ఆరనివ్వాలి. కొంతసేపు అయ్యాక గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా చేయుట వలన పిగ్మెంటేషన్ మచ్చలు, కాలిన గాయాలు, మొటిమల తాలూకు మచ్చల వంటివి అన్ని పోతాయి. ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. కొందరి చర్మం సున్నితంగా ఉంటుంది. ఇలాంటి వారు కలబంద గుజ్జులో కీరదోస రసం, పెరుగు, రోజ్ వాటర్ కలిపి చర్మానికి రాసుకుంటే తాజాగా మరియు కళగా కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *