Home > Politics > కేజ్రీతో నాకు పనేంటీ…

కేజ్రీతో నాకు పనేంటీ…

సీఎంగా ఉత్తమ్....
బ్యారేజీల గేట్ల నిర్మాణం పై మంత్రి హరీశ్ రావు కీలక సమీక్ష

amarindarsingh-kejriwal-apduniaఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్‌కు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ షాకిచ్చారు. క్రేజీవాల్‌ను కలిసేందుకు విముఖత వ్యక్తం చేశారు. కెప్టెన్‌ను కలిసి దేశ రాజధాని ప్రాంతంలో కాలుష్యంపై చర్చించాలని భావిస్తున్న ఆయనకు కలవడం కుదరదని తెగేసి చెప్పారు. బుధవారం ఛండీగఢ్ వెళ్తున్నా.. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలుస్తా. రైతులు పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల కాలుష్యం పెరుగుతున్న విషయం చర్చిస్తానని మంగళవారం ఉదయం క్రేజీవాల్ ట్వీట్ చేశారు. మీతో కూడా మాట్లాడతా, టైం ఇవ్వండని అమరీందర్‌ను కోరారు.ఈ విషయమై పంజాబ్ సీఎం స్పందిస్తూ.. ఆయన నన్నెందుకు కలవాలని అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు. పరిస్థితి మొత్తం అర్థమైనా ఇలా చర్చిస్తాననడం ఏంటని ప్రశ్నించారు. ఆయనతో చర్చలు వృథా అని తేల్చారు. కాలుష్యాన్ని అరికట్టడంలో ఢిల్లీ సీఎం విఫలమయ్యారు. తన ప్రభుత్వ వైఫల్యాన్ని రైతులు కాల్చే వ్యర్థాల మీదకు మళ్లిస్తున్నారని మండి పడ్డారు.ఢిల్లీ పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్‌లలో ఏటా ఈ సీజన్లో రైతులు పంట వ్యర్థాలను పొలాల్లోనే కాల్చేస్తుంటారు. ఫలితంగా దట్టమైన పొగ దేశ రాజధాని కమ్మేస్తోంది. దీంతో ఢిల్లీ మొత్తం స్మాగ్‌తో నిండిపోతోంది. విపరీతమైన కాలుష్యం కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ఇలా కాల్చడాన్ని నివారించాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండాలంటే.. దానికి రైతులు అదనపు మొత్తాన్ని భరించాల్సి వస్తుంది. రైతుల ఆర్థిక పరిస్థితి బాగోలేదని పంజాబ్ సీఎం వాదిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *