Home > Health > తుది దశలో అమరావతి డిజైన్స్

తుది దశలో అమరావతి డిజైన్స్

స్తనాల (వక్షోజ) సైజు పెరగాలంటే ఇవి తినాల్సిందే!
బాలారిష్టాలు దాటని ఇంగ్లీషు మీడియం స్కూల్స్

amaravati-tenders_apduniaరాష్ట్ర శాసన పరిషత్  సముదాయ నిర్మాణానికి వజ్రాకృతిలో ఉన్న డిజైన్‌ను ఎంపికచేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుది నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో నిర్మించనున్న హైకోర్టు భవనానికి స్థూపాకృతిని ఎంపికచేశారు. దీనిని వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చూపించి రెండురోజులలో మొత్తం తుది ఆకృతులను సిద్ధం చేయాలని చెప్పారు.అమరావతిలోని పరిపాలన నగరానికి తుది ఆకృతులను సిద్ధం చేస్తున్న ఫోస్టర్ అండ్ పార్టనర్స్ శాసనపరిషత్ హైకోర్టు భవనాలకు సంబంధించిన సవివర ఆకృతులను ప్రదర్శించారు. తొలుత హైకోర్టు కోసం నార్మన్ ఫోస్టర్స్ సిద్ధం చేసిన వజ్రాకార భవన ఆకృతిని నిశితంగా పరిశీలించిన ముఖ్యమంత్రి దీనిని శాసనపరిషత్ సముదాయం కోసం సిద్ధం చేయాలని సూచించారు. శాసనసభ కోసం రూపొందించిన బుద్ధ స్థూపం ఆకృతిని హైకోర్టు కోసం వినియోగించుకుందామని చెప్పారు.‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో విలువైన వజ్రాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని తమ అసెంబ్లీ భవన రూపంలో చూసుకుని సంతోషపడతారు’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ‘స్థూపం సంతోషానికి చిహ్నం. న్యాయం జరిగినప్పుడే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. కోర్టు గుమ్మం తొక్కిన ప్రతి వ్యక్తి స్థూపాకారంలో వున్న భావనతో ఆలోచిస్తే ఈ ఆకృతి హైకోర్టుకు సరిగ్గా అమరుతుందని దాన్ని ఎంపిక చేస్తున్నట్టు చెప్పారు. అమరావతిలోని నవ నగరాల్లో భాగంగా నిర్మిస్తున్న న్యాయనగరం రానున్న కాలంలో హాంకాంగ్, లండన్ నగరాల్లా భాసిల్లాలన్నదే తన అభిలాష అని తెలిపారు. దీనికోసం నల్సర్ విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత సంస్థలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన లా ఏజెన్సీలను ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ న్యాయవిద్య, న్యాయ సలహా అమరావతిలో తప్పక దొరుకుతుందనే భావన కలగాలన్నారు.పరిపాలన నగరానికి కొనభాగాన, కృష్ణానదికి అభిముఖంగా నిర్మించనున్న ‘సిటీ స్క్వేర్’ అమరావతి నగరానికి ప్రధాన ఆకర్షణగా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆ మేరకు సిటీ స్క్వేర్ ఆకృతులను రూపొందించాలని ఫోస్టర్స్ బృందానికి చెప్పారు. ముఖ్యమంత్రి, గవర్నర్ అధికారిక నివాసాలను సిటీ స్క్వేర్‌లో భాగంగా చెరోవైపు ఉండేలా ఫోస్టర్స్ బృందం డిజైన్ చేయగా, వాటిని అక్కడి నుంచి మార్చాలని ముఖ్యమంత్రి సూచించారు. సిటీ స్క్వేర్ ఆర్థిక కార్యకలాపాలకు ఆలంబనగా అతి పెద్ద వాణిజ్య కేంద్రంగా నిలవాలన్నదే తన ఉద్దేశమని స్పష్టంచేశారు. ఇందులోనే రెస్టరెంట్స్, హోటల్స్, కెఫెటేరియా, షాపింగ్ మాల్స్, మూవీ ధియెటర్స్, స్పోర్ట్స్, రిక్రియేషన్ సెంటర్స్, కన్వెన్షన్ సెంటర్స్ కొలువుదీరాలని చెప్పారు. సిటీ స్క్వేర్‌కు వెళితే అక్కడ సమస్తం ఉంటాయన్న భావన రాజధాని ప్రజలకు కలగాలన్నారు.దీన్ని ఎంత విశాలంగా ఏర్పాటుచేస్తే అంత మంచిదని అంటూ, సీయం, గవర్నర్ నివాసాలను అక్కడ తీసివేసి నదీతీరానికి మార్చాలని సూచించారు. రాజధానిలో నిర్మించే ప్రతి కట్టడం అత్యుత్తమంగా ఉండాలని, ఆ విషయంలో ఎక్కడా రాజీపడబోమని చెప్పారు. ప్రజలలో ఇప్పటికే రాజధానిపై అంచనాలు పెరిగిపోయాయని, ఏదో ఒక రాజధాని నిర్మించాలని అనుకుంటే ఇంతగా పరితపించనవసరం లేదని, ప్రపంచంలోని 5 అత్యుత్తమ నగరాలలో అమరావతిని ఒకటిగా నిలపాలన్నదే తమ అంతిమ లక్ష్యమని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com