Home > General > విశాఖ ఏజెన్సీలో అంత్రాక్స్

విశాఖ ఏజెన్సీలో అంత్రాక్స్

ఏపీలో కంచె ఐలయ్య పుస్తకం నిషేధం
మళ్లీ ఉల్లి లొల్లి

anthrax-dises-apduniaవిశాఖ మన్యాన్ని మరోసారి అంత్రాక్స్ వ్యాది పగబట్టింది.గిరిజనులను చర్మవ్యాదులకు గురి చేస్తూ బయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.విశాఖ మన్యంలోని గిరిజనులు ఆంత్రక్స్ అంటేనే వణికి పోతున్నారు. ఇప్పటికే ఆంత్రాక్స్ బారిన పడిన వారిని విశాక కింగ్ జార్జి ఆసుపత్రిలో ని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఏజెన్సీలోని అరకు సమీపంలోని డుంబ్రీగూడ కు చెందిన ఆరుగురు గిరిజనులను కింగ్‌ జార్జి ఆసుపత్రి లో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.కేజీ హెచ్ లోని చర్మవ్యాధుల విభాగంలో ఆంత్రాక్స్‌ లక్షణాలతో ఆరుగురు గిరిజనులు చేరారు. మన్యంలోని డుంబ్రిగుడ మండలానికి చెందిన టి.దొన్ను, ఎం.రత్ను, టి.సమోరి, కె.గాసి, జె.శ్రీనివాసరావు, టి.రాజులు చర్మ సంబంధిత ఆంత్రాక్స్‌ లక్షణాలతో వచ్చారు. వీరికి చేతులు, వేళ్లపై కురుపులు వచ్చాయి. మైక్రోబయాలజీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివకల్యాణి బాధితుల నుంచి నమూనాలు సేకరించి తదుపరి రోగ నిర్ధరణ పరీక్షలకు శాంపిల్స్‌ పంపారు. బాధితులను కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ జి.అర్జున, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ తదితరులు రోగులకు ప్రత్యే చికిత్స అందిస్తున్నారు. కొన్ని నమూనాలను డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఆర్‌డీఈ)కి పంపుతున్నామని డాక్టర్‌ అర్జున తెలిపారు. రోగుల ఆరోగ్య స్థితి మెరుగ్గా ఉందని, కొన్ని రోజులు ఇక్కడే ఉంచి చికిత్స అందిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *