Home > Movies > అనుష్క కు నిరాశ పుట్టిస్తున్న భాగమతి

అనుష్క కు నిరాశ పుట్టిస్తున్న భాగమతి

ప్రిన్స్ ఆడియోకు భారీ ఏర్పాట్లు
బాహుబలి రికార్డులే టార్గెట్

anushka-bagamati-apduniaఅనుష్క ఆశ‌ల‌న్నీ భాగ‌మ‌తిపైనే ఉన్నాయి. జి. అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యువీ క్రియేష‌న్స్ నిర్మించింది. ఇప్ప‌టికే ఈ సినిమా బ‌డ్జెట్ మ‌రీ హెవీ అయిపోయింద‌ని టాక్‌. రూ.30 కోట్ల‌లో తీద్దామ‌నుకొన్న సినిమా కాస్త రూ.40 కోట్ల‌కు చేరింద‌ట‌. లేడీ ఓరియెంటెడ్ సినిమాల జ‌మానాకు కాలం చెల్లిపోతోంది. అనుష్క గ్లామ‌ర్, క్రేజ్ త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఈ ద‌శ‌లో రూ.40 కోట్ల బ‌డ్జెట్ అంటే మాట‌లు కాదు. దానికి తోడు.. ఈసినిమా గురించి జ‌నం కూడా పెద్ద‌గా మాట్లాడుకోవ‌డం లేదు. పైగా… చిత్రీక‌ర‌ణ ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల కాలేదు. మొత్తానికి ఏదోలా షూటింగ్ పూర్త‌య్యింది. ఈ ద‌స‌రాకి భాగ‌మ‌తిగా అనుష్క ఎలా ఉంటుందో చూపిద్దామ‌నుకొంటోంది చిత్ర‌బృందం. అయితే.. ఇప్పుడు చిత్ర‌బృందం మ‌ర‌మ‌త్తుల్లోకి దిగింద‌ట‌. ర‌షెష్ చూసుకొన్న త‌ర‌వాత‌.. కొన్ని స‌న్నివేశాల్ని సీజీ వ‌ర్క్‌కి అనుగుణంగా రీషూట్ చేయాల్సివ‌స్తోంద‌ట‌. అందుకోసం క‌నీసం మ‌రో వారం రోజులు అనుష్క డేట్లు కావాల్సివ‌చ్చింద‌ని స‌మాచారం. అక్టోబ‌రులో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొద్దామ‌నుకొన్నారు. ప‌రిస్థితి చూస్తుంటే డిసెంబ‌రుకీ గ్యారెంటీ లేకుండా పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *