Home > Movies > ఉత్తరాదిలో దుమ్ము రేపుతున్న అర్జున్

ఉత్తరాదిలో దుమ్ము రేపుతున్న అర్జున్

మళ్లీ విలన్ గా గోపీచంద్
గృహంలో హారార్ సెక్స్
 
alluarjunస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘సరైనోడు’ హిందీ ప్రేక్షకులకు భలే నచ్చేసింది. హిందీలోకి అనువాదించిన ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’.. 2016, ఏప్రిల్ 22న విడుదలైంది. బాక్సాఫీసు వద్ద రూ.130 కోట్లు వసూళ్లు చేసింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను ఈ ఏడాది మేలో విడుదల చేసి, యూట్యూబ్‌లో పెట్టారు. ఇప్పటి వరకు దాదాపు 100 మిలియన్ (10 కోట్ల వ్యూలు) మంది ఈ సినిమా చూశారు.ఉత్తరాదిలో హిందీ డబ్బింగ్ చిత్రాలకు గిరాకీ బాగా పెరిగింది. పలు ప్రముఖ టీవీ చానెళ్లు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల హక్కులు కొనుగోలు చేసి హిందీలోకి డబ్బింగ్ చేసి ప్రసారం చేస్తున్నారు. మరికొందరు యూట్యూబ్‌లో విడుదల చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. ఏదీ ఏమైనా మన తెలుగు సినిమాలకు ఉత్తరాదిలో ఇంత గిరాకీ ఉందంటే.. గ్రేటే కదూ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com