Home > Crime > 2009 నాటి డొంక కదులుతోంది

2009 నాటి డొంక కదులుతోంది

గంజాయి దందాలో హిజ్రాలు
చిర్రెత్తుకొచ్చి ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లాడు

ganta-srnivas-raoఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలని అనకాపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. మరి మంత్రి హోదాలో ఉన్న గంటాపై ఇలా అరెస్టు వారెంట్ జారీ కావడానికి కారణం ఏమిటంటే.. ఎన్నికల్లో అక్రమాల వ్యవహారం. సార్వత్రిక ఎన్నికల్లో గంటా ఓటర్లను ప్రలోభ పెట్టాడనే ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. ఇది 2009 నాటి వ్యవహారం!2009 సార్వత్రిక ఎన్నికల్లో గంటా నిబంధనలకు విరుద్ధంగా క్రికెట్ కిట్టులు పంపిణీ చేశాడని చేశారని.. ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో ఇలాంటి అక్రమాలు జరిగాయని కేసు నమోదు అయ్యింది. ఇన్నేళ్లు ఆ కేసు విచారణలో ఉంది. పలుసార్లు గంటా వ్యక్తిగత హాజరీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన కోర్టుకు హాజరు కాలేదు.అనకాపల్లి కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. గంటా ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి కేసులో ఇప్పుడు అరెస్టు వారెంటు జారీ కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *