Home > Vanitha > కళే ప్రాణం పొసింది…

కళే ప్రాణం పొసింది…

సెల్ఫ్ రెస్పెక్ట్ కు ప్రాధన్యం
అతి చిన్న కండలరాణి
 
34 treditional-arts_apduniaయుద్ధ సమయంలో పాకిస్థాన్ సింధూ పరివాహక ప్రాంతం నుంచి వలస వచ్చినవారు.. రాజస్థాన్‌లోని దండ్‌కాలాలో స్థిరపడ్డారు. 1987లో వచ్చిన కరువు వాళ్లను అతలాకుతలం చేసింది. కొందరు ఆకలికి తాళలేక ప్రాణాలు వదిలారు. మరికొందరు పొట్ట చేతబట్టుకుని పట్నం బాటపట్టారు.మగవారు ఇళ్లు వదిలి వెళ్లినా అక్కడి మహిళలు మాత్రం తమ సంప్రదాయ కళను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వాళ్లకు మాత్రమే సొంతమైన స్పెషల్ ఎంబ్రాయిడరీతో ఆకట్టుకుంటున్నారు.టాంకా భారత్, సూఫ్, పక్కా, కంబిరి, ఖరక్, కచ్చా, సింధి వంటి రకరకాల డిజైన్లలో ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఆదాయం పొందుతున్నారు. 1988లో ప్రారంభమైన యూఆర్‌ఎమ్‌ఎల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలంతా ఈ సంప్రదాయ కళకు ప్రాణం పోస్తున్నారు. కొలాయట్ బ్లాక్‌లో మొత్తం 113 గ్రామాల్లో వేల మంది మహిళలు ఈ స్పెషల్ ఎంబ్రాయిడరీతో చేతినిండా సంపాదిస్తున్నారు. తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ ఏరియా నుంచి పట్టణాలకు వలసలు తగ్గుముఖం పట్టాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *