Home > Crime > పది నెలల్లో ఆటో ప్రమాద మృతులు 67

పది నెలల్లో ఆటో ప్రమాద మృతులు 67

ప్రకాశంలో పెరుగుతున్న క్రైమ్ రేట్

autoరోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అతివేగం ఒక కారణమైతే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మరో కారణం. ముఖ్యంగా ఆటోల ద్వారానే యాక్సిడెంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్ లో ఆటోల సంఖ్య ఎక్కువగా ఉండటం పైగా ట్రాఫిక్ నిబంధనలను పాటించక పోవండంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 67 మంది ఆటో ప్రమాదంలో చనిపోయారు. ఎక్కువగా సైబారాబాద్ లోనే 50 మంది మృతి చెందగా…17 మంది హైదరాబాద్ లో చనిపోయారు.ఆటో ల యాక్సిడెంట్ తర్వాత ఎక్కువగా టు వీలర్స్, కార్లు, లారీలు, ఆర్టీసీ బస్సుల ద్వారా ఎక్కువగా యాక్సిడెట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పోలీసుల రికార్డుల్లో సైబరాబాద్ లో ఆటో యాక్సిడెంట్ కేసులు 4 వందలు నమోదు కాగా..హైదరాబాద్ లో 187 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో 7వందల మంది గాయపడ్డారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించడంతో లక్షా పదివేల కేసులను నమోదు చేశారు పోలీసులు.ఇందులో డైవర్లు యూనిఫాంలు వేసుకోక పోవడం, ఫర్మిషన్ లేకుండా స్కూలు పిల్లలను తీస్కెళ్లడంతో హైదరాబాద్, సైబరాబాద్ పరిధిల్లో ఈ కేసులు నమోదయ్యాయి.ఇవే కాకుండా అతివేగంగా డ్రైవింగ్ చేయడం, సిగ్నల్స్ ఆపకుండా వెళ్లిపోవడం, రాంగ్ రూట్ లో వెల్లడంతో మరో 6వందల కేసులను ఆటో డ్రైవర్లపై నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *