Home > Politics > అరకు కాఫీకి ప్రచారం లేదు : మంత్రి అయ్యన్న

అరకు కాఫీకి ప్రచారం లేదు : మంత్రి అయ్యన్న

"స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను అగ్ర‌స్థానంలో నిలుపుదాం"
ఎంపీ స్కూళ్లలో జైహింద్ కల్చర్

ayyanna-patrudu-apduniaవిశాఖ మన్యం ప్రాంతంలో పండుతున్న అరకు కాఫీ గురించి విదేశాలలో గొప్పగా చెప్పుకొంటున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మన్యం కాఫీ సాగు గొప్పతనాన్ని ప్రశంసించారు. బుదవారం నాడు విశాఖజిల్లా అరుకులో పర్యటించిన ఆయన స్థానిక పీఎంఆర్సీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల విదేశాలలో పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ విశాఖ ఏజెన్సీలో పండుతున్న కాఫీ గురించి గొప్పగా చర్చించుకోవడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.  విదేశాలలో చర్చించుకుంటున్న అరకు కాఫీ గురించి స్థానికంగా అంతగా ప్రచారం దక్కకపోవడం బాధాకరమన్నారు. కాఫీ సాగు విస్తరించేందుకు ప్రభుత్వ కృత నిశ్చయంతో ఉందన్నారు. ప్రతి రైతు ఏటా లక్షల్లో ఆదాయం కాఫీ ద్వారా సమకూరాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. ఐటీడీఏ పరిధిలో ప్రస్తుతం ప్రాజెక్టు అధికారి రవి సుభాష్‌ చేపడుతున్న గ్రావిటీ పథకం నిర్మాణం తీరు ఆకట్టుకుందన్నారు. ఇంజినీర్లు ద్వారా ఇదే పని చేపడితే రూ.12 లక్షల వరకూ ఖర్చు అవుతుందని, దీనిని పీవో ప్రత్యేక శ్రద్ధతో ప్రజా భాగస్వామ్యంతో రూ.3.50 లక్షలతోనే పూర్తి చేయడాన్ని మంత్రి అభినందించారు. హుకుంపేట మండలం నిమ్మలపాడులో గ్రావిటీ పథకం పనితీరులో ప్రజా భాగస్వామ్యం హర్షించదగ్గ విషయమన్నారు.

మరోవైపు అరకు, డుంబ్రిగూడ, హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల రోడ్లను ఆకస్మికంగా తనిఖీ లు చేసారు. అయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రాజమండ్రి నుండి కెడిపేట, లంబసింగీ, చింతపల్లి, జి,మాడుగుల, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగూడ, అరకువేలీ మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి చెయ్యడానికి ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ఈ రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. రోడ్ల,భవనాల నిర్మాణాల విషయంలో నాణ్యత లోపించినట్లైతే చర్యలు తీసుకుంటానని చెప్పారు. అలాగే గంజాయి రవాణా విషయమై విలేఖరులు అడగ అన్ని విషయాలు పోలీస్ వారికీ తేలిన గంజాయి రవాణా చేసే వారిమీద ఎటువంటి కేసులు పెట్టట్లేదు. గంజాయి రవాణా చేసే వారిపై పిడి యాక్ట్ కేసులు పెట్టినట్లయితే గంజాయి రవాణా పూర్తిగా అరికట్టవచ్చని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *