Home > Movies > చైనాలో ప్రమోషన్ కు బాహుబలి టీమ్

చైనాలో ప్రమోషన్ కు బాహుబలి టీమ్

శోభన పెళ్లి చేసుకోబోతోందోచ్!
బాలీవుడ్ సినిమాకు రకుల్ సైన్

baahubali-2-china-apduniaతెలుగు, తమిళం, హిందీ, మళయాళం భాషల్లో విడుదలైన బాహుబలి 2 సినిమా నిన్నటితో 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా రూ.1,684 కోట్లు వసూలుచేసిన ఈ సినిమా త్వరలోనే రూ.1,700 మార్క్‌ని అందుకోనుంది. ఇదిలావుంటే, సెప్టెంబర్‌లో చైనాలో రిలీజ్ కానున్న చైనీస్ వెర్షన్ ప్రమోషన్స్ కోసం ఈ బాహుబలి స్టార్స్ త్వరలోనే చైనా వెళ్లనున్నారు. బాహుబలి 2 చైనీస్ వెర్షన్‌ని చైనాలో రిలీజ్ చేయనున్న ‘ఈ స్టార్స్ ఫిలింస్’ సంస్థ సీఈఓ ఎల్లెన్ లీనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. చైనాలో దాదాపు 4,000 థియేటర్లలో బాహుబలి 2 సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు లీ తెలిపారు.బాహుబలి 2 చైనీస్ వెర్షన్ దాదాపు 44.1 మిలియన్ డాలర్స్ వసూలు చేస్తుందని లీ అంచనా వేస్తున్నారు. తైవాన్, జపాన్, సౌత్ కొరియా దేశాల్లోనూ బాహుబలి 2 విడుదలయినట్టయితే… దంగల్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ని బాహుబలి 2 అధిగమిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అదే కానీ జరిగితే ఇప్పటికే ఇండియన్ స్టార్ అయిపోయిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ఇక తిరుగులేనట్టే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *