Home > Movies > పోటీ లేకుంటే చప్పగా ఉంటుంది : బాలకృష్ణ

పోటీ లేకుంటే చప్పగా ఉంటుంది : బాలకృష్ణ

విదేశీ గడ్డలపై భారత నటులకు ప్రాధాన్యం పెరిగింది
మోహన్ బాబుకు లక్కులేదట

balakrishna1_apduniaనందమూరి బాలకృష్ణ నటించిన వందో చిత్రం “గౌతమిపుత్రశాతకర్ణి”. ఈ చిత్రం ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం గురించి బాలకృష్ణ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో పాత్ర చేస్తున్నప్పుడు ఆహార్యం, గెటప్‌లు అదిరిపోయాయని చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి వారి పాత్రలు చూస్తూ లీనమైపోయాయని చెప్పారు. అందువల్లే ఆ పాత్రలు చేస్తున్నంత సేవు తనలో ఆవేశం, కోపం, రౌద్రం వంటివి ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు మన పూర్వీకులను తలచుకుంటానని చెప్పారు. ఇలాంటి చిత్రంలో నటించాలని తనను ఏవో శక్తులు ప్రేరేపించినట్టుగా వచ్చాయన్నారు. సంక్రాంతి సినీ సమరంపై ఆయన స్పందిస్తూ సాధారణంగా ఎక్కడైనా పోటీ అనేది ఉండాలన్నారు. పోటీ లేకుంటే చప్పగా ఉంటుంది. తన ఒక్కడి చిత్రమే ఆడితే.. తానేదో బిల్డప్‌ ఇస్తున్నాడని అనుకుంటారు. అది కాదు పద్దతి. పోటీ కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలాగే ప్రతి సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. తనకు ఉండే అభిమానులు తనకు ఉంటారని, కానీ కొన్ని పాత్రలు కొందరే చేయగలుగుతారని అందవల్ల ప్రతి ఒక్కరూ ప్రతి అభిమాని చిత్రాన్ని చూడాలని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం “ఖైదీ నంబర్ 150” గురించి సోమవారం మాట్లాడుతూ సంక్రాంతి రేసులో పోటీ అనేది లేదని, కేవలం ఇది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమేనని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. బాలయ్య మాత్రం పోటీ ఉండి తీరాల్సిందేనంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *