Home > Movies > క్రిష్… ఎంతో కష్టపడ్డారు

క్రిష్… ఎంతో కష్టపడ్డారు

మంచు విష్ణుకు మోహన్ బాబు వార్నింగ్
మళ్లీ ఇండియన్ ఐడల్ లో తెలుగోడు రేవంత్

balakrishna-krish-shatakarni-apduniaగౌతమీ పుత్ర శాతకర్ణి మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుపుకున్న ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చేయడం పూర్వ జన్మ సుకృతం అంటున్నారు నందమూరి బాలయ్య. గౌతమిపుత్ర శాతకర్ణి నేను కావాలని వందో సినిమాగా ప్లాన్‌ చేసింది కాదు. వందో సినిమా అంటే ప్రత్యేకంగా ఉండాలని చాలా కథలు విన్నా. అందులో ఈ కథ ఎందుకో విపరీతంగా నచ్చింది. ఎవ్వరికీ పెద్దగా తెలియని ఒక గొప్ప వ్యక్తి కథ చెప్తున్నామన్న ఆలోచన కలగగానే వెంటనే ఒప్పేసుకున్నా. నిజానికి ఇలాంటి ఒక ప్రత్యేక సినిమా నా వందో సినిమా కావడం పూర్వ జన్మ సుకౄతంగా భావిస్తానన్నారు. నేనెప్పుడూ ఇలాంటి కొత్తదనమున్న సినిమాలు తీయడం రిస్క్ అనుకోను. ధైర్యంగా ముందడుగు వేస్తేనా ఏదైనా సాధించగలం. మేమందరం ఈ సినిమాను మొదట్నుంచీ బలంగా నమ్మాం. ఇప్పుడు ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూశాక విజయంపై అంతే ధీమాగా ఉన్నాం.

తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరు శాతకర్ణి. అలాంటి వ్యక్తి కథ ఎంతమందికి తెలుసు? అలాంటి వ్యక్తి జీవితంలోని రకరకాల భావోద్వేగాలు ఎంతమందికి తెలుసు? ఇవన్నీ ఆలోచించడంతోనే నాకు చాలా ఉత్సాహం వచ్చేసింది. ఇక నాన్నగారు (నందమూరి తారకరామారావు) ప్రసాదించిన వరమో ఏమో తెలియదు కానీ, ఇలాంటి సినిమాలు చేయాలన్న ఆలోచన ఆయనను తలచుకున్నప్పుడల్లా బలపడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా పాత్ర కోసం కసరత్తులు చేయడం అంటూ ఏమీ లేదు. దర్శకుడు క్రిష్‌ గారి విజన్‌, నాన్నగారు కూడా ఈ సినిమా చేయాలనుకొని ఉండడం లాంటివన్నీ నన్ను ముందుకు నడిపించాయి. సినిమా చేస్తున్నంత కాలం నాన్నగారు ఎక్కడో ఓ అదౄశ్య శక్తిలా నన్ను నడిపించారని అనిపిస్తూంటుంది. బహుశా ఆయన ప్రేరణ లేకపోతే ఈ సినిమా ఇంత సులువుగా చేయగలిగేవాడిని కాదేమోనన్నారు బాలయ్య. క్రిష్‌ ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన గతంలో చేసిన ఐదు సినిమాలూ వేటికవే ప్రత్యేకమైనవి. నా దగ్గరకు వచ్చే దర్శకులు చాలామంది ఒకే రకమైన మూస కథలను పట్టుకొస్తూ ఉంటారు. క్రిష్‌ ఇలాంటి కొత్త కథను తీసుకురావడమే నాకు ఉత్సాహాన్నిచ్చింది. నన్నడిగితే ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్‌‌గతో క్రిష్‌ను పోల్చవచ్చు. ఎప్పటికప్పుడు డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ ఉండే స్పీల్‌బర్‌‌గతో క్రిష్‌ను పోల్చానంటే ఆలోచించండి. మూవీ సక్సెస్ క్రెడిట్‌ అంతా టీమ్‌ ప్లానింగ్‌కు దక్కాలి. ఒక మంచి పనిచేస్తున్నపుడు పంచ భూతాలన్నీ మనకు సహకరిస్తాయంటారు. అలా ఈ సినిమా షూటింగ్‌ జార్జియా, మొరాకో లాంటి ప్రాంతాల్లో చేసినప్పుడు కూడా మాకు ఏ ఇబ్బంది కలగలేదు. జార్జియాలో అయితే అంతటా వర్షం పడేది కానీ, మా షూటింగ్‌ ప్రాంతం మాత్రం మామూలుగా ఉండేది. ఇవన్నీ మన పనికి సహకరించేవిగానే చెప్పుకోవచ్చు.గురప్రు స్వారీ, కత్తి తిప్పడం లాంటివి నేనెప్పుడూ నేర్చుకోలేదు. ఆదిత్య 369, భైరవద్వీపం ఆ సమయంలో సినిమాకు అవసరం అంటే చేసేశా. అదే ఉత్సాహంతో ఇప్పుడూ ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఏదీ తీసుకోలేదన్నారు హేమా మాలిని లాంటి గొప్ప నటి మా సినిమాలో నటించారు. నాన్నగారి సినిమాలో ఒకసారి నటించారామె. మళ్ళీ ఇన్నేళ్ళకు తెలుగులో ఒక బలమైన పాత్రతో మెప్పించనున్నారు. ఇక శ్రీయ చాలా తెలివైన నటి. ఆమె ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. కబీర్‌ బేడి కూడా విలన్‌గా చాలా బాగా చేశారు. కచ్చితంగా నా వందో సినిమా స్థాయికి తగ్గ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణిని చెప్పుకోవచ్చు. సినిమా చూసిన మేమంతా ఒక మంచి సినిమా తీశామన్న నమ్మకంతో, విజయంపై ధీమాగా ఉన్నాం. 2 గంటల 15 నిమిషాల్లో కథకు అవసరమయ్యే అన్ని అంశాలతో క్రిష్‌ ఒక గొప్ప సినిమా తీశాడు. సినిమాకు ఏది అవసరమో దాన్నే చెప్పడానికి అందరినీ ఒప్పించడంలో క్రిష్‌ చూపిన ప్రతిభ వల్లే ఇది సాధ్యమైందను కుంటున్నానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *