Home > Politics > సింగరేణి కార్మికులకు సోంత ఇళ్లు : ఎంపి బాల్క్ సుమన్

సింగరేణి కార్మికులకు సోంత ఇళ్లు : ఎంపి బాల్క్ సుమన్

అసంతృప్తి సెగ!
సదావర్తి భూములపై సీబీఐ విచారణ : ఎమ్మెల్యే ఆర్కే

balka-suman-apduniaగతంలో చంద్రబాబు ప్రభుత్వం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు నిలిపివేసేందుకు ఉత్తర్వులు జారీచేస్తే చంద్రబాబుకు వత్తాసు పలికి సంతకాలు చేసి జాతీయ కార్మిక సంఘాల నేతలు కార్మికులకు ద్రోహం చేసారని ఎంపి బాల్క సుమన్ ఆరోపించారు. గురువారం నాడు మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలోని సి ఆర్ క్లబ్ లో నిర్వహించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకర్తల సమావేశం లో అయన పాల్గోన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్ లు పాల్గొన్నారు .బాల్క సుమన్ సమక్షం లో పలు కార్మిక సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీబీజీకేఎస్ లో చేరారు. తెలంగాణలోఅన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కై ఆహార్నిశలు కృషి చేస్తు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశం లోనే నెంబర్ వన్ ముఖ్య మంత్రి కెసిఆర్ అని సుమన్అన్నారు. సింగరేణి ఎన్నికలే అస్త్రాగా చేసుకొని జాతీయ సంఘాలతో పొత్తులు పెట్టుకొని కెసిఆర్ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రలు ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని అయన ఆరోపించారు. .సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం పై ఇచ్చిన మాటకు కట్టుబడి సియం కెసిఆర్ కృషి చేస్తున్నాడని అన్నారు .సింగరేణి కార్మికులకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు సియం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com