Home > Editorial > సంస్కరణలో దిశగా బ్యాంకింగ్ రంగం

సంస్కరణలో దిశగా బ్యాంకింగ్ రంగం

దేశ ప్రగతి ప్రధాన ధ్యేయం కావాలి
ఆటకెక్కిన ఆటలు

banking_apdunia48ఏళ్ల క్రితం బ్యాంకుల జాతీయీకరణతో క్లాస్ బ్యాంకింగ్ మాస్ బ్యాంకింగ్‌గా మారింది. 1980లో మరో 6 ప్రైవేటు బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. 1955 జులై 1 నుంచి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారటం, 1959లో ఎస్‌బిఐకి మరో 7 అసోసియేట్ బ్యాంకుల ఏర్పాటుతో దేశంలో ప్రభుత్వరంగం బ్యాంకింగ్ ఆరంభ మైంది. 1969లో దేశం మొత్తంమీద 8826 బ్యాంక్ బ్రాంచీలుండగా ఇవాళ వాటిసంఖ్య 1,37,770. అదే కాలంలో డిపాజిట్లు రూ.5500 కోట్లనుంచి రూ.1,05,51,180 కోట్లకు పెరిగాయి. మొత్తం అడ్వాన్సు లు రూ. 75,95,500 కోట్లకు చేరాయి. మారుమూలలకు కూడా చేరిన ప్రభుత్వరంగ బ్యాంకులు మనదేశ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా పని చేస్తున్నాయనటంలో సందేహానికి తావులేదు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు మంచికన్నా చెడుకారణాలతోనే వార్తల్లోకి ఎక్కటం నిరాక రించలేని వాస్తవం. అయితే ఇందుకు బాధ్యులెవరు? బ్యాంక్ యాజమాన్యాలా? సిబ్బందా? ప్రభుత్వ విధానాలా?ద్రవ్యపెట్టుబడి వనరు పెట్టుబడిదారుల ఉక్కు పిడికిలినుంచి బయటపడి ప్రజలకు చేరువైంది. క్రమంగా కోట్లమంది పేదలు, ఇతర సామాన్యులు తొలిసారి బ్యాంక్ గడపతొక్కారు. ప్రజల ఆర్థికాభివృద్ధికి, మౌలిక వసతులు సమకూర్చే ప్రభుత్వ పథకాలకు వనరుల లభ్యత హెచ్చింది. జన్‌ధన్ ఖాతాలతో బ్యాంకింగ్ అత్యధిక ప్రజల జీవితంలో భాగమైంది.1991 తర్వాత పెట్టుబడిదారులకు, ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలకు బ్యాంకు రుణాల వరద మొదలైంది. మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలన్నీ ప్రైవేటీకరించ టంతో ఆ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చటం బ్యాంకుల వంతు అయింది. పరిశ్రమల స్థాపన, విలీనాలు- స్వాధీనాలకు బ్యాంకులే పెట్టుబడులు సమకూర్చుతున్నాయి. ఈ సరళీకరణ ప్రవాహంలో బ్యాంకు ఉన్నతస్థాయి అధికారులు అక్కడక్కడ అవినీతికి పాల్పడి సరైన మదింపులేకుండా కొన్ని రుణాలు మంజూరుచేసి ఉంటారు తప్ప, పారుబాకీలు తలకుమించిన భారంగా తయారుకావటానికి ప్రభుత్వ బ్యాంకింగ్ విధానాలే కారణం. బ్యాంకులు ప్రభుత్వానివి. వాటికి అవసరమైన మూలధనం సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అందుకు తగినంత శ్రద్ధ చూపని ప్రభుత్వం బ్యాంకింగ్ సంస్కరణల పేరుతో వాటి వాటాలను ప్రైవేటువారికి విక్రయిస్తున్నది.బ్యాంకుల లాభదాయకత తగ్గలేదు. అయితే ఎన్‌పిఎల భారం కింద కృంగు తున్నాయి. 2016—17లో ప్రభుత్వరంగ ఆపరేటింగ్ లాభం రూ. 1,50,000కోట్లు, నికరలాభం రూ.500కోట్లు.అంటే లాభాల్లో దాదాపు 95 శాతం కార్పొరేట్లు, బడా వ్యాపారుల పారుబాకీల సర్దుబాటుకుపోతున్నది. బ్యాంకింగ్ వ్యవస్థను ఆందోళనలో పడేసిన మొండి బకాయిల్లో 60 శాతం వరకు రైటాఫ్ చేయాల్సిన పరిస్థితి రానుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. టాప్-50 అతి పెద్ద ఎగవేతదారుల రుణాలను రద్దు చేస్తే రూ. 2.4 లక్షల కోట్లవరకు భారం ఏర్పడనుందని వెల్లడించింది. మొండిబకాయిల సమస్యలతో సత మతమవుతున్న బ్యాంకులు భారీమొత్తంలో తమ నగదును వదులుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దాదాపు 50 కంపెనీలు తమ రుణాలను చెల్లించే పరిస్థితిలో లేవని, దివాలా స్థితిలో ఉన్న వీటి గురించి బ్యాంకులు కూడా ఆశలు వదులుకో వాల్సిందే అని క్రిసిల్ వెల్లడించింది. ఈ సంస్థల మొత్తం మొండిబకాయిలు రూ.4 లక్షల కోట్ల మేర ఉన్నాయి. అప్పులు తీసుకున్న కంపెనీల్లో ఎక్కువగా నిర్మాణ రంగం వాటా నాలుగింట ఒక టో వంతు ఉన్నాయి. అలాగే మెటల్ రంగం కూడా అత్యధిక మొత్తంలో మొండిబకాయిలను కలిగి ఉండగా, ఆ తర్వాత 15 శాతంతో పవర్ సెక్టార్ ఉంది. మొత్తం నిరర్థక ఆస్తుల్లో కనీసం సగానికి పైగా రుణాలు ఈ రంగాలవే కావడం గమనార్హం. బ్యాంకుల వద్ద మొత్తం నిరర్థక ఆస్తు లు రూ.7.29 లక్షల కోట్లగా తేలింది. భారత జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)లో ఇవి 5 శాతం ఉం టాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *