Home > General > ఏపీలో కంచె ఐలయ్య పుస్తకం నిషేధం

ఏపీలో కంచె ఐలయ్య పుస్తకం నిషేధం

పింఛా ప్రాజెక్టుకు జలకళ
విశాఖ ఏజెన్సీలో అంత్రాక్స్

kancha-ilaiah-apduniaరచయిత, ప్రొఫెసర్ కంచ ఐలయ్య రచించిన వివాదాస్పద పుస్తకంపై ఆర్య వైశ్యుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పుస్తకంపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించే ఆలోచనలో వుంది. మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కంచ ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్యులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ పుస్తకాన్ని నిషేధించడంతోపాటు ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ఐలయ్యపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్యులు డిమాండ్ చేస్తున్నారు.ఆర్యవైశ్య సంఘాల నిరసనల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఏపీ డీజీపీ సాంబశివరావు వివాదంపై పరిస్థితిని సీఎంకి వివరించినట్టు సమాచారం. దీంతో కులాల మధ్య కుంపటి పెట్టే వివాదాలని ఉపేక్షించేది లేదని సీఎం చెప్పినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అవసరమైతే, కంచ ఐలయ్య రచించిన పుస్తకంపై నిషేధం విధించడానికైనా వెనుకాడేది లేదని ఏపీ ప్రభుత్వం భావిస్తోందనేది ఆ వార్తల సారాంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *