Home > Vanitha > Beauty > చర్మ సౌందర్యానికి ఉప్పు….

చర్మ సౌందర్యానికి ఉప్పు….

కేశసౌందర్యానికి ఉల్లి చేసే మేళ్ళేంటో చూద్దామా!
పనీర్ లాలీ పాప్

salt-beauty-apduniaఉప్పు వంటకాల్లో రుచినే కాదు.. అందానికి వన్నె తెస్తుంది. మెరిసే చర్మానికి ఉప్పు ఉపయోగపడుతుంది. ఇది న్యాచురల్ క్లెన్సర్ లా ఉపయోగపడుతుంది. అసలు ఉప్పు అందాన్ని రెట్టింపు చేయడంలో ఎలా ఉపయోగపడుతుందని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కానీ మెరిసే పళ్లు పొందడానికి, నోటి దుర్వాసన దూరం చేయడానికి ఉప్పు సహాయపడుతుంది.

అలాగే చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు, గోళ్ల అందానికి కూడా రాళ్ల ఉప్పు అద్భుతమైన పరిష్కారమని బ్యూటి ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. కాబట్టి బ్యూటి ప్రాడక్ట్స్ కి బదులు ఉప్పుని మీ బ్యూటి కిట్ లో చేర్చుకోవాల్సిందే. మరి చర్మ సౌందర్యానికి ఉప్పును ఎలా ఉపయోగించాలో చూద్దాం.. ఉప్పు సహజసిద్ధమైన క్లెన్సర్. ఇది చర్మంపై పేరుకున్న మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. రాళ్ల ఉప్పుని కొన్ని నీళ్లలో కలిపి.. స్ప్రే బాటిలో నిల్వ ఉంచుకోవాలి. దీన్ని ఎప్పుడు అవసరమైతే.. అప్పుడు ముఖంపై స్ప్రే చేసి.. తుడుచుకుంటూ ఉంటే.. ఫేస్ ఫ్రెష్ గా కనిపిస్తుంది.

స్నానం చేసిన తర్వాత చర్మం తడిగా ఉన్నప్పుడు ఉప్పు చల్లుకుని సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. లేదా కొబ్బరినూనెలో కొద్దిగా ఉప్పు కలిపి.. శరీరమంతా రుద్దుకోవాలి. ఇలా ఒక నిమిషం చేస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. కళ్లకింద నల్లటి వలయాలు ఇబ్బందిపెడుతుంటే.. కొద్దిగా గోరువెచ్చని నీటిలో ఉప్పు కలుపుకుని.. నీళ్లలో ముంచిన దూదిని కళ్ల మీద పెట్టుకుంటే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. రెగ్యులర్ గా చేస్తూ ఉంటే.. కళ్లకింద నల్లటి వలయాలు తొలగిపోతాయి.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *