Home > Bhakti > తిరుమల భక్తులకు కరెన్సీ కష్టాలు తీరినట్లేనా!

తిరుమల భక్తులకు కరెన్సీ కష్టాలు తీరినట్లేనా!

శ్రీశైల మల్లన్న సన్నిధిలో డ్రమ్స్ శివమణి సందడి
కార్తీక శోభతో శ్రీశైలం కళకళ

swiping in ttd_apduniaపెద్దనోట్ల రద్దు అనంతరం కరెన్సీ కష్టాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా తిరుమల భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. ఈ క్రమంలో భక్తుల కష్టాలు తీర్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమలలో అన్నిచోట్లా స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు పేర్కొన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు కరెన్సీతో పనిలేకుండా తిరుమలలోని 23 చోట్ల స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ లో లడ్డూలు తీసుకునే క్రమంలో స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేసే అంశంపై చర్చిస్తున్నట్లు చెప్పారు. నూతన దివ్యదర్శనం క్యూ కాంప్లెక్స్ లో మరిన్ని స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *