Home > Bhakti > దేవుడికి వెండి కిరీటాలు చేయించిన బిచ్చగాడు

దేవుడికి వెండి కిరీటాలు చేయించిన బిచ్చగాడు

దశావతారాల్లో కనిపించనున్న భద్రాద్రి రామయ్య
2 నుంచి ‘దివ్య దర్శనం’

Temple-beggar-donates-silver-crown_apduniaఓ బిచ్చగాడు దేవుడికి వెండి కిరీటాలు చేయించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఏ గుడి పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేశాడో అదే గుడిలోని దేవుడికి రెండు వెండి కిరీటాలు చేయించాడు. కొంత నగదును నిత్య అన్నదానానికి విరాళంగా ఇచ్చాడు. నల్లగొండ జిల్లాకు చెందిన యాదిరెడ్డి(75) 11 ఏళ్ల వయసున్నప్పుడు జీవనోపాధి కోసం విజయవాడ వెళ్లాడు. యవ్వన దశ నుంచి వృద్ధాప్యం వరకు విజయవాడలోనే గడిపాడు. 45 సంవత్సరాలు రిక్షా తొక్కుతూ – ఇతర పనులు చేస్తూ జీవనం సాగించాడు. వృద్ధాప్యంలో పనిచేయడం చేతకాకపోవడంతో విజయవాడలోని వీధుల్లో కోదండరామ ఆలయం వద్ద భిక్షాటన చేయడం ప్రారంభించాడు. యాదిరెడ్డికి వివాహం కాలేదు. భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని తన ఖర్చులకు పోను మిగిలిన నగదును ఆధ్యాత్మికం కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కోదండరాముడికి రెండు వెండి కిరీటాలు చేయించాడు. వాటికి రూ.1,50,000 ఖర్చు అయింది. అంతే కాకుండా రూ.20 వేలను నిత్య అన్నదానానికి విరాళంగా ఇచ్చాడు. కొద్దికాలం క్రితం సాయినాథుడికి కూడా వెండి కిరీటాన్ని చేయించి ఇచ్చాడు. ఈ నిర్ణయంపై యాదిరెడ్డి స్పందిస్తూ దేవుడే తనకు గొప్ప శక్తి – ధైర్యం అని చెప్పారు. దేవుడి దయ వల్లే ఇంతకాలం జీవించగలిగానని భావోద్వేగానికి లోనయ్యాడు. దేవుడికి చిన్న కానుక ఇవ్వాలని నిర్ణయించుకుని వెండి కిరీటాలను చేయించానని యాదిరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *