Home > Bhakti > ఆంక్షల మధ్యలో రాములోరి సన్నిధి

ఆంక్షల మధ్యలో రాములోరి సన్నిధి

పద్మావతి అమ్మవారి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు

bhadrachalam-apduniaభద్రాద్రి రాములోరి సన్నిధి ఆంక్షల సంకెళ్లలో కూరుకుపోయింది! ఒకప్పుడు సీతారాముల నీడలో, వారి చల్లని చూపుతో వివాహం జరిగేది. కానీ ప్రస్తుతం అది అసాధ్యం కానుంది. ఇటీవలే జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం భద్రాద్రిలో హల్‌చల్ చేస్తోంది. కర్నూలుకు చెందిన నరేష్ బాబు, శివపార్వతులు శుభప్రదంగా వివాహం చేసుకునేందుకు భద్రాచలం వచ్చారు. అయితే పెళ్లిళ్లు నిషేధమని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. చివరికి తానీషా కల్యాణ మండపంలో వివాహం చేసుకుని వెళ్లాల్సి వచ్చింది. దీనికి గాను రూ.2500 రుసుం చెల్లించాలని అధి కారులు చెప్పినట్టు సమాచారం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఉన్న కోదండ రామాలయంలో పెళ్లి జరిపించారు. ఏది ఏమైనప్పటికీ భద్రాద్రి రాముల వారి సన్నిధానంలో పెళ్లి జరుపుకునేందుకు విధించిన ఆంక్షల వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. భక్తిభావంతో వేలాది రూపాయలు వెచ్ఛించి ఇక్కడి చేరుకున్న తర్వాత అవమానాలు ఎదురువుతున్నాయని పలువురు భక్తులు బాహాటంగానే అసహనం వ్యక్తం చేశారు. రామాలయానికి వచ్చే భక్తుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది.తానీషాలో పెళ్లికి రూ.2500 కట్టాలని తామేమీ అడగలేదని రామాలయం ఇఒ ప్రభాకర్ శ్రీనివాస్ తెలిపారు. ఆరోపణలపై విచారణ చేశామని అది అవాస్తవమని తేలిందన్నారు. రామాలయంలో పెళ్లిళ్లు జరిగినప్పుడు రూ.500 చెల్లించేవారని, తానీషాలో పెళ్లికి కూడా రూ.500 చెల్లిస్తే సరిపోతుందాన్నారు. ఎవరైనా డబ్బులు ఎక్కువగా అడిగితే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facebook Auto Publish Powered By : XYZScripts.com