Home > General > భద్రాచలానికి పోలవరం ముంపు

భద్రాచలానికి పోలవరం ముంపు

రైల్వే జోన్ లింక్ మరో అడ్డంకి
సమంత....ఏమంత...

bhadrachalam-apduniaపోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం సహా పరిసర్లాలోని 36 మేజర్ గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గోదావరితో పాటు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని తదితర ఉపనదులన్నీ భద్రాచ లం సమీపంలోనే కలుస్తుండడంతో వరదముప్పు ఎక్కువగా ఉంటుందని, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేదానిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో నిర్మించిన కరకట్టలు ఇకపైన ఉధృతంగా ప్రవహించే గోదావరి జలాల, దాని వెన్నంటే ప్రభావం చూపే తిరుగు జలాల (బ్యాక్ వాటర్) వేగానికి తట్టుకోవడం అనుమానమేనని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రభావంపై తా జాగా పుణెలోని సిడబ్లుపిఆర్‌ఎస్ (సెంట్రల్ వా టర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్)తో అధ్యయనం చేయించాలని అనుకుంటోంది. 1986లో గోదావరి వరదల (182 అడుగుల మేర) కారణంగా భద్రాచలం పట్టణంలో మెజారిటీ భాగం నీట మునగ్గా నాలుగైదేళ్ల క్రితం కేంద్ర జలసంఘం బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేస్తే 191 అడుగుల వరకు ప్రభావం ఉంటుందని తేలింది. దుమ్ముగూడెంతో పాటు సమీపంలోని మణుగూరు, సింగరేణి గనులపై, భార జల కేంద్రంపై పరోక్ష ప్రభావం ఉండవచ్చని నిపుణుల అంచనా. అట వీ, పర్యావరణ సమస్యలతో పాటు గిరిజన నివా స ప్రాంతాలకు, వన్యప్రాణులకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నా జాతీయ హోదా పేరుతో వీటిని పరిష్కరించకుండానే పోలవరం ప్రాజెక్టు ను నిర్మిస్తున్నారని అభిప్రాయపడ్డారు. తొలుత 36 లక్షల క్యూసెక్కుల గరిష్ఠ వరద ప్రవాహంతో ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించగా దాన్ని ఇప్పు డు 50 లక్షల క్యూసెక్కుల అంచనాకు అనుగుణంగా ఎపి ప్రభుత్వం డిజైన్లు రూపొందిస్తోంది. పోలవరం కొత్త డిజైన్‌తో తెలంగాణకు చాలా నష్టం జరుగుతుందని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఎపిఇఆర్‌ఎల్ (ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబ్) అధ్యయనం ప్రకా రం 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహానికే (191 అడుగుల మేర) భద్రాచలంలో ముంపు ఉండవచ్చన్న అంచనాతో 1986 అనుభవంతో భద్రాచలం పట్టణం చుట్టూ కరకట్ట ఎత్తును 190 ఫీట్ల ఎత్తు వరకు పెంచారు. ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్‌వాటర్ ప్రభావం, పోలవరం కట్టిన తర్వాత తెలంగాణలోని 36 మేజర్ గ్రామాల, మరో 40 చిన్న గ్రామాల భవిష్యత్తుపై తెలంగాణ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కడం కోసం కరకట్టల ఎత్తు మరో పది అడుగుల మేర పెంచాల్సి ఉంటుందని, ఇందుకు సుమారు రూ. వెయ్యి కోట్ల మేర ఖర్చు కావచ్చని, దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలని తెలంగాణ అభిప్రాయపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *