Home > Politics > వరుస ఎన్నికల్లో బీజేపీ డీలా

వరుస ఎన్నికల్లో బీజేపీ డీలా

రేవంత్ పైన కవిత పోటీ
జగన్ కి ఝలక్ ఇస్తున్న సొంతోళ్లు

bjp-apduniaమోదీ హావా తగ్గుతోంది. ఎన్నికల నాటికి అంత ఊపు ఉండే అవకాశం లేదు. ఫలితంగా మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం అంత తేలిక కాదు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో భాజపాకు షాక్‌ తగిలింది. చిత్రకూట్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయభేరి మోగించింది. కమలం అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి 14,333 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చిత్రకూట్‌ సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌ కుమార్‌ మరణంతో ఇక్కడ ఎన్నిక జరిగింది. నవంబర్‌ 9న ఉప ఎన్నిక నిర్వహించగా..ఇవాళ కౌంటింగ్ చేసారు. ఈ ఎన్నికల్లో మొత్తం 12 మంది బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి శంకర్‌ దయాళ్‌ త్రిపాఠి, కాంగ్రెస్‌ అభ్యర్థి నిలాన్షు చతుర్వేది మధ్య గట్టిపోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు చేపట్టగా.. శంకర్‌ దయాళ్‌కు 52,677 ఓట్లు రాగా…చతుర్వేదికి 66,810 ఓట్లతో విజయం సాధించారు.

పంజాబ్, నాందేడ్ లోను అదే తీరు.. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్‌ 1.93 లక్షల భారీ మెజారిటీ సాధించడం మాములు విషయం కాదు. అసెంబ్లీ ఎన్నికల విజయాల పరంపరను ఇకమీదట కొనసాగిస్తోంది. బీజేపీ ఎంపీ వినోద్‌ ఖన్నా చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించగా,,,కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ జక్కడ్‌ 4,99,752 ఓట్లు సాధించగా… బీజేపీ అభ్యర్థి స్వరన్‌ సలారియాకు 3,06,533 ఓట్లు వచ్చాయి. ఆప్‌ అభ్యర్థి సురేశ్‌ ఖజురియా 23,579 ఓట్లు మాత్రమే పొంది డిపాజిట్‌ కోల్పోయారు. హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ విజయం కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. అక్కడే కాదు..మహారాష్ట్రలోని నాందేడ్ మున్సిపల్ ఎన్నికల్లోను కాంగ్రెస్ హావా కొనసాగించిన సంగతి తెలిసిందే. మొత్తం 81 సీట్లకు గాను..73 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. బీజేపీకి ఇక్కడ కేవలం ఆరు సీట్లే వచ్చాయి. మరోవైపు శివసేనకు ఒక్కటంటే ఒక్కటి రాగా..మిగిలిన చోట ఇండిపెండెంట్ గెలిచారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ లో ఉత్సాహం నింపుతున్నాయి. రాబోయే సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచి బీజేపీ సమాయత్తమవుతోంది. లోక్ సభ ఎన్నికల్లో 350 సీట్ల పై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేసింది. ఈ మేరకు బీజేపీ నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి కేంద్ర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు, ఇతర పార్టీ నిర్వాహకులు హాజరయ్యారు. దేశంలోని 115 సీట్లలో బీజేపీ ఇంత వరకు గెలవలేదు. వాటి పై దృష్టి పెట్టాలని అమిత్ షా నేతలకుసూచించారు. ఇప్పుడు బిజెపికి 282 సీట్లు ఉన్నాయి. వీటిలో 50 నుంచి 60 సీట్లు కోల్పోవచ్చని ముందే ఒక అంచనాకు వచ్చారు అమిత్ షా. అందుకే వాటి స్థానంలో కొత్త సీట్లను సాధించాలని చెప్పారు. ఐదుగురు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్ తదితరులకు ఐదు లోక్ సభ సీట్లు గెలిచే బాధ్యతలను అప్పగించారు. వారు తమ ఆలోచనలతో ఆయా సీట్లను రాబోయే ఎన్నికల్లో గెలుచుకు రావాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల పై దృష్టి పెట్టిన బీజేపీ ఎంపీ సీట్లను గెలిచే కసరత్తు చేస్తోంది. ఆ మేరకు పార్టీ అధ్యక్షుల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తోంది. త్వరలోనే ఏపీలో అమిత్ షా పర్యటిస్తున్న సమయంలో ఈ భేటీ ఉత్కంఠను పెంచుతోంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ఏం జరుగుతుందోనన్న చర్చ సాగుతోంది.

Tags: ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *